శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద

శ్రీశైలం జలాశయానికి స్వల్పంగా వరద కొనసాగుతోంది.

Update: 2024-08-08 05:51 GMT

దిశ, డైనమిక్‌ బ్యూరో: శ్రీశైలం జలాశయానికి స్వల్పంగా వరద కొనసాగుతోంది. ఎగువ పరివాహక ప్రాంతాలు అయినటువంటి జూరాల సుంకేసుల నుండి 3,30,632 వరద నీరు వచ్చి చేరడంతో జలాశయం నిండుకుండలా తలపిస్తుంది. జూరాల 2,84,347 సుంకేసుల 40,311 క్యూసెక్కులు, శ్రీశైలం జలాశయానికి భారీగా వరద వచ్చి చేరుతోంది. జలాశయానికి ప్రస్తుతం ఇన్‌ ఫ్లో 3,30,632 ఉండగా ఔట్‌ ఫ్లోగా, 3,74,304 ఎడమ కుడి జల విద్యుత్‌ ఉత్పత్తి ప్రారంభించారు. అయితే శ్రీశైలం జలాశయం పూర్తిస్దాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 882.60 అడుగులగా ఉంది అలానే జలాశయం పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు కాగా ప్రస్తుతం 202.5056 టీఎంసీలుగా ఉంది.

అటు శ్రీశైలం నుంచి ఇటు ప్రకాశం బ్యారేజి వరకు.. జలాశయాలు, నీటి ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. రెండేళ్ల కిందటి వరకు నీరు లేక వెలవెలబోయిన పాజ్రెక్టులు ఇప్పుడు నిండుకుండను తలపిస్తోంది. ఎగువ నుంచి భారీగా వరద నీరు వస్తుండంతో పల్నాడు జిల్లా పులిచింతల 11 గేట్లను ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. కృష్ణమ్మ పరవళ్లను చూసేందుకు సందర్శకులు తరలివస్తున్నారు. వరద కారణంగా పులిచింతల ముంపు గ్రామాల్లోకి నీరు చేరుతోంది. గ్రామాల్లో ఉంటున్నారని వారిని ఖాళీ చేయాలని అధికారులు సూచిస్తున్నారు. పులిచింతల జలాశయం పూర్తి సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటినిల్వ 31.89 టీఎంసీలకు చేరుకుంది. ఎగువ నుంచి 2.45 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో అధికారులు 2.30 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. 

Tags:    

Similar News