ఒక్క చాన్సంటూ.. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు : మాజీ మంత్రి దేవినేని ఉమా
పరిపాలనా అనుభవం లేక ఒక్క చాన్సంటూ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని మాజీ మంత్రి దేవినేని ఉమా మండిపడ్డారు.
దిశ, వెబ్‌డెస్క్ : పరిపాలనా అనుభవం లేక ఒక్క చాన్సంటూ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని మాజీ మంత్రి దేవినేని ఉమా మండిపడ్డారు. ఇవాళ అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సందప సృష్టించడం చేతకాక, అందిన కాడికి అప్పులు చేసి ఆంధ్రా ఆర్థిక వ్యవవస్తను అతలాకుతలం చేశారని ధ్వజమెత్తారు. రహదారులపై రక్తం చిందుతున్న నేటికి గుంతలు కూడా పూడ్చలేదంటూ ఫైర్ అయ్యారు. అభివృద్ధి కోసం జగన్ ప్రభుత్వం చేసిన ఖర్చు శూన్యమని.. ఒక్కరికి కూడా ఉపాధి కల్పించలేదని దేవినేని ఉమ పేర్కొన్నారు. అప్పు చేసి తెచ్చిన డబ్బు రూ.లక్షల కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్తోందని ప్రశ్నించారు.