ప్రకాశం బ్యారేజీ బోట్ల వెలికితీత.. విజయవంతంగా ఒడ్డుకు ఓ బోటు
ప్రకాశం బ్యారేజీ దగ్గర బోట్ల తొలగింపు ప్రక్రియలో ఇంజినీర్లు సూపర్ సక్సెస్ సాధించారు.
దిశ, వెబ్‌డెస్క్: ప్రకాశం బ్యారేజీ (Prakasam Barrage) దగ్గర బోట్ల తొలగింపులో కీలక అప్‌డేట్ వచ్చింది. బోట్ల తొలగింపు ప్రక్రియలో బెకెం ఇన్‌ఫ్రా ఇంజినీర్లు (Bekem Infra Engineers) సూపర్ సక్సెస్ సాధించారు. మొత్తం మూడు బోట్లలో నుంచి ఓ బోటును విజయవంతంగా ఒడ్డుకు చేర్చారు. 40 టన్నుల భారీ బరువున్న బోటును ఒడ్డుకు చేర్చామని, ఇక మిగిలిన బోట్లను కూడా త్వరలో బయటకు తీయడానికి ప్రయత్నిస్తామని ఇంజినీర్లు చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో ఈ మధ్య భారీ వర్షాలు కురవడంతో విజయవాడ (Vijayawada)కు వరద పోటెత్తిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎగువ నుంచి ఒక్కొక్కటీ 40 టన్నుల బరువుండే మూడు భారీ బోట్లు వేగంగా కొట్టుకొచ్చి ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టాయి. దీంతో బ్యారేజీ పిల్లర్లు కూడా కొంత మేర డ్యామేజ్ (Dammage) అయ్యాయి. ఈ క్రమంలోనే ఆ బోట్లను తొలగించేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నిస్తోంది. కానీ నదీ ప్రవాహ వేగం ఎక్కువగా ఉండడంతో పాటు బోట్లు భారీ బరువు ఉండడంతో వాటిని తొలగించడం ప్రభుత్వానికి పెద్ద సవాల్‌గా మారింది. ఈ క్రమంలోనే ఎక్స్‌పీరియన్స్‌డ్ ఇంజీనర్లను బరిలోకి దించింది.