ఎన్నికల ఫలితాలపై మరోసారి జగన్ సంచలన వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల పలితాలపై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఎమ్మెల్సీలతో సమావేశమయ్యారు.
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల పలితాలపై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఎమ్మెల్సీలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్సీలు ప్రలోభాలకు లొంగొద్దు అని సూచించారు. భయపెట్టేలా ఎన్ని కేసులు పెట్టినా వెనకడుగు వేయొద్దు అని చెప్పారు. 40 శాతం మంది ప్రజలు మనవైపే ఉన్నారని ధైర్యం చెప్పారు. ఐదేళ్లలో మనం ఎన్ని పనులు చేశామో.. ఎంత మంచి చేశామో ప్రజలకు కూడా తెలుసని అన్నారు. ఎన్నికల ఫలితాలు శకుని పాచికల మాదిరి ఉన్నాయని అభిప్రాయపడ్డారు. ఈవీఎంలపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగాలని కోరారు. బీజేపీ, జనసేన, టీడీపీ హనీమూన్ నడుస్తోందని విమర్శించారు. వెంటనే తొందర పడకుండా వారికి ఇంకొంత సమయం ఇద్దామని పార్టీ శ్రేణులకు సూచించారు. అసెంబ్లీలో మన నోరును కట్టడి చేసే అవకాశం ఉందని.. అందుకే మండలిలో గట్టిగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.