AP News:పవన్ కళ్యాణ్ పుట్టినరోజున జనసేన జెండాకు అవమానం..భగ్గుమంటున్న జనసైనికులు

ఏ పార్టీ అయినా సరే తమ పార్టీ జెండాను(Party flag) ఎంతో గౌరవంగా చూసుకుంటారు. ఆ జెండాకు అవమానం జరిగితే సహించరు.

Update: 2024-09-10 08:33 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఏ పార్టీ అయినా సరే తమ పార్టీ జెండాను(Party flag) ఎంతో గౌరవంగా చూసుకుంటారు. ఆ జెండాకు అవమానం జరిగితే సహించరు. కానీ జనసేన పార్టీ జెండా పట్ల ఓ వైసీపీ నేత చేసిన పాడు పని చూస్తే ఛీ ఛీ అనకుండా ఉండలేము. వివరాల్లోకి వెళితే.. ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. జనసేన జెండా పై వైసీపీ యూత్ లీడర్(YCP youth Leader) మూత్రం విసర్జించి అవమానించినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వైసీపీ యూత్ లీడర్ ఆరిగిపల్లి సెంటర్‌లో అర్ధరాత్రి మద్యం తాగి తన ఫార్చ్యూనర్ కారులో బెజవాడకు(Vijayawada) వెళ్తున్నాడు.

కారులో వెళ్తున్న ఆయన రివర్స్‌లో వచ్చి రోడ్డు పక్కన పార్కింగ్ చేసి ఉన్న జనసేన నేత(Janasena) కారుపై ఉన్న పార్టీ జెండాపై మూత్రం పోశారని సమాచారం. ఈ ఘటన జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) పుట్టిన రోజు సెప్టెంబర్ 2న ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ దృశ్యాలు అక్కడ ఉన్న సీసీ కెమెరాలో(Camera) రికార్డయ్యాయి. దీంతో ఆలస్యంగా ఈ ఘటన వెలుగు చూసింది. ఈ ఘటనపై సాక్ష్యాధారాలతో పోలీసులకు జనసేన నేత ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నూజివీడు ఇన్చార్జ్ డీఎస్పీ శ్రవణ్, సీఐ రామకృష్ణ విచారణ చేపట్టారు.


Similar News