Heavy Rains Alert:ఘాట్ రోడ్డులో విరిగిపడ్డ కొండ చరియలు..అటువైపు వెళ్లొద్దని అధికారుల హెచ్చరిక!

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

Update: 2024-09-01 11:16 GMT

దిశ,వెబ్‌డెస్క్:బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్ష ప్రభావంతో జనజీవనం స్తంభించింది. ఈ క్రమంలో వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. రహదారులన్నీ చెరువులను తలపిస్తున్నాయి. రహదారులపై నీరు చేరి రాకపోకలు బంద్ అయ్యాయి. పల్నాడు జిల్లా, యడ్లపాడు మండలం కొండవీడు ఘాట్ రోడ్డులో భారీ వర్షాలతో కొండచరియలు విరిగిపడ్డాయి. మూలమలుపు వద్ద పలు చోట్ల పెద్ద బండరాళ్లు జారి కిందపడి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

ఈ ఘటన పై అప్రమత్తమైన అధికారులు కొండ దిగువన ఉన్న చెక్ పోస్ట్ వద్ద వాహనాలు నిలిపేశారు. దగ్గర్లోని గొలుసుకట్టు చెరువులు నిండుకుండలా మారాయి. మరోవైపు, నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం ఈగలపెంట సమీపంలోని శ్రీశైలం ఘాట్ రోడ్డులో కొండ చరియలు విరిగి పడటంతో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. కొండ చరియలు విరిగి పడుతున్న నేపథ్యంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున శ్రీశైలం వెళ్లే భక్తులు, పర్యాటకులు రావద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ క్రమంలో అటువైపు రాకపోకలు బంద్ చేశారని అధికారులు తెలిపారు.


Similar News