Occult Worship:ఆ జిల్లాలో క్షుద్రపూజలు కలకలం.. భయాందోళనలో స్థానికులు

ఈ ఆధునిక, టెక్నాలజీ కాలంలో కూడా క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి. మూఢనమ్మకాలు ఇంకా పోలేదు అనడానికి మంత్రాలు, క్షుద్రపూజలు నిదర్శనంగా ఉంటున్నాయి.

Update: 2024-08-25 09:02 GMT

దిశ,వెబ్‌డెస్క్:ఈ ఆధునిక, టెక్నాలజీ కాలంలో కూడా క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి. మూఢనమ్మకాలు ఇంకా పోలేదు అనడానికి మంత్రాలు, క్షుద్రపూజలు నిదర్శనంగా ఉంటున్నాయి. మంత్రాలకు చింతకాయలు రాలుతాయా? అంటే అవుననే అంటున్నారు కొందరు. పెరిగిన విజ్ఞానంతో మనిషి అంతరిక్షాన్ని సైతం అధిరోహిస్తున్నారు. అలాంటి కాలంలో మాయ శక్తులు ఉన్నాయని నమ్మిస్తూ..కొందరు క్షుద్రపూజలు చేస్తున్నారు. తమకు గిట్టని వారికి ఏదైనా చెడు చేయాలనే అక్కసుతో కొందరు వారి ఇళ్ల ముందు క్షుద్రపూజలు చేయడం వారిపై మంత్రాల ప్రయోగం చేయడం పాత కాలపు ముచ్చటను నేడు కొత్త పుంతలు తొక్కుతున్నాయి.

వివరాల్లోకి వెళితే..చిత్తూరు జిల్లా కుప్పంలో ఆదివారం ఉదయం క్షుద్రపూజలు కలకలం రేపాయి. ప్యాలెస్‌ రోడ్డులోని ఆంధ్రా బ్యాంక్‌ ఎదురుగా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్రపూజలు చేసిన ఆనవాళ్లు కనిపించాయి. నడిరోడ్డుపై ముగ్గేసి క్షుద్రపూజలు చేసినట్లుగా ఆనవాళ్లు ఉన్నాయి. అంతేకాదు దాని చుట్టూ రక్తపు మరకలు ఉండటంతో జంతు బలి ఇచ్చారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కుప్పంలో క్షుద్ర పూజలు చేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ ఘటనపై అధికారులు వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.


Similar News