జనసేన పార్టీ కాదు.. ఆంధ్ర మత సేనా పార్టీ.. వైఎస్ షర్మిల సంచలన ట్వీట్
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా మేల్కొని బీజేపీ మైకం నుంచి బయటికి రావాలని ఏపీసీసీ ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల అన్నారు.
దిశ, వెబ్ డెస్క్: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan) ఇప్పటికైనా మేల్కొని బీజేపీ (BJP) మైకం నుంచి బయటికి రావాలని ఏపీసీసీ ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల (APCC President YS Sharmila) అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీరుపై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆమె.. సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆమె.. జనసేన పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, చేగువేరా (Che Guvera), గద్దర్ (Gaddar) అన్న సిద్ధాంతాలకు నీళ్ళొదిలేశారని అన్నారు. ఇప్పుడు ఆయన ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi), కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Union Minister Amit Shah) సిద్ధాంతాలను ఆదర్శంగా తీసుకున్నారని, ఆర్ఎస్ఎస్ (RSS) భావజాలాన్ని నరనరాన జీర్ణించుకున్నారని వ్యాఖ్యానించారు.
అంతేగాక జనసేనా పార్టీని (Janasena Party) "ఆంధ్ర మతసేనా" పార్టీగా (Andhra Mathasena Party) మార్చారని దుయ్యబట్టారు. జనం కోసం పుట్టిన పార్టీ అని చెప్పి ఒక మతానికి అజెండాగా మార్చడం దారుణమని మండిపడ్డారు. సర్వమత సమ్మేళనంగా విరాజిల్లుతున్న ఆంధ్రరాష్ట్రంలో విభజించు పాలించు అన్నట్లుగా మీ వైఖరి ఉండటం విచారకరమని అన్నారు. పార్టీ పెట్టి 11 ఏళ్లు పోరాడి, ఉప ముఖ్యమంత్రిగా భాద్యతలు చేపట్టి, మతం రంగు పూసుకుని, ఒకరి ప్రయోజనాలే లక్ష్యం అన్నట్లుగా మాట్లాడటాన్ని కాంగ్రెస్ పార్టీ (Congress Party) ఖండిస్తోందని తెలిపారు. స్వాతంత్య్ర సమరయోధుల ఆశయాలతో పుట్టిన పార్టీ అని చెప్పి, మత పిచ్చి బీజేపీ ఆశయాలను అలవరుచుకోవడం దురదృష్టకరమని అన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ ఇప్పటికైనా మేల్కోండి.. బీజేపీ మైకం నుంచి బయట పడండి అని షర్మిల సూచించారు.
READ MORE ...
‘ఏమ్మా.. మా పవనన్న గ్లాస్ లేదా?’.. మంత్రి లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు(వీడియో వైరల్)