చంద్రబాబే కాదు నెల్లూరులో ఓ పెద్దమనిషి అరెస్ట్ అవ్వడం ఖాయం : మాజీమంత్రి అనిల్

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ స్కాం కేసులో అరెస్టై రిమాండ్‌లో ఉన్న అంశంపై మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఘాటుగా స్పందించారు.

Update: 2023-09-28 05:19 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ స్కాం కేసులో అరెస్టై రిమాండ్‌లో ఉన్న అంశంపై మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఘాటుగా స్పందించారు. స్కిల్ స్కాంలో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని బలమైన ఆధారాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. పక్కా ఆధారాలతోనే సీఐడీ అరెస్ట్ చేసింది అని చెప్పుకొచ్చారు. చంద్రబాబుకు కోర్టులు కూడా బెయిల్ ఇవ్వకపోవడానికి అదే కారణం అని స్పష్టం చేశారు. టీడీపీ హయాంలో చంద్రబాబు చేసిన స్కాం లు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి అని చెప్పుకొచ్చారు. చంద్రబాబుకు 23 లక్కీ నంబర్ అని ఎద్దేవా చేశారు. వైసీపీకి చెందిన 23 మందికి లాక్కున్నాడు.. 2014లో ఆయనకి వచ్చిన సీట్లు 23.. జైలుకు వెళ్లిన డేట్ కూడా 23 యే అంటూ సెటైర్లు వేశారు. చంద్రబాబు అరెస్ట్ పై సొంత పార్టీ నేతలే సైలెంట్‌గా ఉంటే.. మా పార్టీ నుంచి జంప్ అయిన ఎమ్మెల్యే ల హడావుడి ఎక్కువైంది అని చెప్పుకొచ్చారు. మునిగిపోయే పడవలో కూర్చుని ఎక్కువ రోజులు వారు రాజకీయం చెయ్యలేరు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. యే వయస్సులో తప్పు చేసినా.. నేరం నేరమే.. భవిష్యత్తు లో చంద్రబాబు మరిన్ని కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుంది అని తెలిపారు. మరోవైపు నెల్లూరు జిల్లాలో ఒక వ్యక్తి పెద్దమనిషి లాగా ముసుగు వేసుకొని తిరుగుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో అన్ని ఆధారాలతో లోపలికి వెళ్తారు అంటూ మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్ జోస్యం చెప్పారు.

Tags:    

Similar News