AP News: ముగిసిన నామినేషన్ల పర్వం.. ఆ జిల్లాలో మొత్తం 237 నామినేషన్లు
నిన్నటితో ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల నామినేషన్ పర్వం ముగిసింది.
దిశ, ప్రతినిధి, మచిలీపట్నం: నిన్నటితో ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల నామినేషన్ పర్వం ముగిసింది. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లాలో పార్లమెంట్ స్థానానికి 37 నామినేషన్లు ధాఖలయ్యాయి. అలానే జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు 200 నామినేషన్లు పడ్డాయి. కాగా చివరి రోజైన గురువారం ఒక్క రోజే 95 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ నెల 26న నామినేషన్ల పరిశీలన జరగనుంది.
అలానే 29వ తేదీ మధ్యాహ్నం 3గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. కాగా ఉపసంహరణల అనంతరం బరిలో నిలిచిన అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించనున్నారు. జిల్లా మొత్తంగా దాఖలైన నామినేషన్లను పరిశీలిస్తే అత్యధికంగా గుడివాడ నియోజకవర్గానికి 40 నామినేషన్లు రాగా, అత్యల్పంగా పామర్రు నియోజకవర్గానికి 17 నామినేషన్లు వచ్చాయి.
మచిలీపట్నంకు 36, గన్నవరం 34, పెనమలూరుకు 26, పెడనకు 24, అవనిగడ్డకు 23 నామినేషన్లు దాఖలయ్యాయి. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ అధికార వైసీపీ, కూటమి అభ్యర్థులతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా పోటీలో నిలిచింది.