AP youth: ఉచితం వద్దు, ఉపాధి ముద్దు.. దేవుడా.. ఇదేందయ్యా ఇది..!

కూర్చుని తింటే కొండలైనా కరిగిపోవాల్సిందే.

Update: 2024-05-21 05:22 GMT

దిశ వెబ్ డెస్క్: కూర్చుని తింటే కొండలైనా కరిగిపోవాల్సిందే. అలాంటది నిరుపేద రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌ ఉపాధిలేని ఉచిత పథకాలను తట్టుకోగలదా..? అనే ప్రశ్న ఏపీ యువతలో ఆందోళన కలిగిస్తోంది. గత ఐదేళ్లుగా ఆంధ్రాలో ఒక్కటంటే ఒక్కటైనా కొత్త పరిశ్రమ రాలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఉచిత పథకాల ముచ్చట తప్ప ఉపాధి ఊసెత్తలేదు.

నిరుద్యోగ యువత వైపు కన్నెత్తి చూడలేదు. కష్టపడి పని చేసే వ్యక్తులకు కూడ ఉచ్చితంగా డబ్బులు ఇచ్చి, రాష్ట్రాన్ని అప్పుల ఊభిలోకి నెట్టింది. కనీసం 2024లో అయినా ఉచిత పథకాల బాటలో పయనించకుండా, ఉపాధి కల్పించి, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారని ఆశ పడిన వారికి వైసీపీ మేనిఫెస్టో నిరాశనే మిగిల్చిందని నిరుద్యోగులు, రాష్ట్రంలో కంపెనీలు ఉంటే ఇతర రాష్ట్రాలకు వాళ్లాల్సిన పరిస్థితి వచ్చేది కాదని ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగం చేస్తున్న ఉద్యోగులు వైసీపీపై పీకల లోతు కోపంతో ఉన్నారు.

ఇక ప్రభుత్వ ఉద్యోగుల గురించి చెప్పాల్సిన పనిలేదు, గాత ఐదుళ్లలో వైసీపీకి వ్యతిరేకంగా ధర్నాలు చేసిన ఘటనలు కోకొల్లలు. దీనితో 2024 ఎన్నికల్లో వైసీపీకి ఓటమి తప్పదని అంటున్నారు విశ్లేషకులు. మేనిఫెస్టో విదుల చేసిన తరువాతే ఫ్యాన్ గాలి తగ్గినట్టు తెలుస్తోంది.

అసలు వైసీపీ మేనిఫెస్టోలో ఏముంది..?

ఎప్పటిలానే అమ్మ ఒడి, విద్యాకానుక, మహిళలకు వైఎస్సార్‌ చేయూత తదితర పథకాల కొనసాగుతాయని తెలిపింది. అమ్మ ఒడి పథకం కింద ఇస్తున్న రూ.15వేలను రూ.17వేలకు, వైఎస్సార్‌ చేయూత పథకం కింద  8 విడతల్లో రూ.75 వేల నుంచి రూ. లక్షా 50 వేలకు పెంచుతామని, అలానే రెండు విడతల్లో పింఛన్లు రూ.3500 చెల్లిస్తామని పేర్కొంది.

వైఎస్సార్ కాపు నేస్తం నాలుగు దశల్లో రూ.60 వేల నుంచి రూ.లక్షా 20వేలకు, వైఎస్సార్ ఈబీసీ నేస్తం నాలుగు విడతల్లో రూ.45వేల నుంచి రూ. లక్షా 5 వేలకు పెంచుతామని చెప్పింది. అలానేరూ.3 లక్షల వరకు రుణాలు వైఎస్సార్‌ సున్నా వడ్డీ కింద ఇస్తామని చెప్పింది. ఇలా ఆటో, ట్యాక్సీ, లారీలు కొనుగోలు చేసేవారికి వడ్డీ రాయితీ, లారీ డ్రైవర్లు, టిప్పర్‌ డ్రైవర్లకు కూడా వాహన మిత్ర, ఆటో, ట్యాక్సీ, లారీ డ్రైవర్లకు రూ.10 లక్షల ప్రమాద బీమా, చేనేతలకు సాయం, ట్యాబ్‌ల పంపిణీ, ఇలా చాలా ఉచిత పథకాలను ప్రకటించింది. కానీ.. నిరుధ్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని.. కొత్త కంపెనీలను తెస్తామని చెప్పలేదు. అందుకే ఫ్యాన్ గాలి తగ్గి, సైకిల్ వేగం పెరిగింది అనే వార్తలు వినిపిస్తున్నాయి.

టీడీపీ మేనిఫెస్టోలో ఏముంది..?

టీడీపీ మేనిఫెస్టోలో సూపర్ సిక్స్‌ను ప్రకటించింది. ఈ సూపర్ సిక్స్‌‌లో భాగంగా యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది. అలానే నిరుద్యోగ భృతి నెలకు 3000 ఇస్తామాని తెలిపింది. పాఠశాలకు వెళ్లే విద్యార్థులకు సంవత్సరానికి 15000 ప్రకటించింది. 19నుండి59 ఏళ్ల వయసుకలిగిన మహిళలకు నెలకు 1500, ప్రతి ఇంటికి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని,  మహిళలకు RTCలో ఉచిత ప్రయాణం కల్పిస్తామని పేర్కొంది. అలానే సౌభాగ్య పథకం కింద స్టార్ట్‌అప్‌తో పాటుగా చిన్న, మధ్య తరహా పరిశ్రమలు పెట్టుకోవాలని అనుకునేవాళ్లకు 10 లక్షల సబ్సీడి ఇస్తామని హామీ ఇచ్చింది.

టీడీపీ, వైసీపీ మేనిఫెస్టోల మద్య తేడా ఏముంది..?

టీడీపీ, వైసీపీ రెండు పార్టీలు కూడా మేనిఫెస్టోలో ఉచిత పథకాలను పేర్కొన్నాయి. అయితే వైసీపీ కేవలం ఉచిత పథకాలపైన మాత్రమే దృష్టి పెట్టింది. ఉపాధి గురించిగాని, రాష్ట్ర అభివృద్ధి గురించి ఎక్కడా ప్రస్తావించ లేదు. కాని టీడీపీ యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది. అలానే నిరుద్యోగ భృతి నెలకు 3000 ఇస్తామాని తెలిపింది.

ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి కోచింగ్‌కు, కావాల్సిన పుస్తకాలకు నిరుద్యోగ భృతి ఉపయోగ పడుతుంది. అలానే సౌభాగ్య పథకం కింద స్టార్ట్‌అప్‌తో పాటుగా చిన్న, మధ్య తరహా పరిశ్రమలు పెట్టుకోవాలని అనుకునేవాళ్లకు 10 లక్షల సబ్సీడి ఇస్తామని తెలిపింది. దీని ద్వారా రాష్ట్రంలో పరిశ్రమలను ప్రోత్సహిస్తూనే, ఉపాధిని సైతం కల్పిస్తోంది. అందుకే ప్రజలు టీడీపీవైపు మొగ్గు చూపినట్టు విశ్లేషకులు పేర్కొంటున్నారు. 


Similar News