అమరావతికి గుడ్ న్యూస్.. రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్

అమరావతికి రైల్వే లైన్‌కు కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది...

Update: 2024-10-24 10:01 GMT

దిశ, వెబ్ డెస్క్: అమరావతి(Amaravati)కి రైల్వే లైన్‌(Railway line)కు కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఏపీ రాజధాని(AP Capital) అమరావతికి రైల్వే లైన్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాని మోదీ(Prime Minister Modi) అధ్యక్షతన భేటీ అయిన కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. గంటూరు జిల్లా ఎర్రుపాలెం(Yerrupalem) నుంచి అమరావతి మీదుగా నంబూరు(Nambur) వరకు కొత్త రైల్వే లైన్ వేసేందుకు కేంద్రం ఓకే చెప్పింది. ఇందుకోసం 57 కిలో మీటర్ల మేర రైల్వే లైన్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. అంతేకాదు రూ. 2,245 కోట్లు విడుదలకు ఆమోదం తెలిపింది. కృష్ణా నది(Krishna river)పై 3.2 కిలో మీటర్ల మేర రైల్వే బ్రిడ్జిను నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. చెన్నై, కోల్ కతా, హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ నగరాలతోఈ రైల్వే లైన్ అనుసంధానం  కానుంది. ఈ మేరకు కేంద్ర కేబినెట్ భేటీలో కేంద్రమంత్రులు నిర్ణయం తీసుకున్నారు.

కాగా రాష్ట్ర విభజనలో భాగంగా ఏపీ రాజధానికి రైల్వే లైన్ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. 2014-19 సమయంలోనే రైల్వే లైన్ కోసం అప్పటి టీడీపీ ప్రభుత్వం అడుగులు వేసింది. ఇందుకు కేంద్రం కూడా ఓకే చెప్పింది. అయితే మధ్యలో ప్రభుత్వం మారడంతో పెండింగ్‌లో పడిపోయింది. మళ్లీ ఇన్ని రోజులకు అమరావతి రైల్వే లైన్ నిర్మాణంపై కీలక అడుగు పడింది. 


Similar News