అంతుచిక్కని నేపథ్యం.. అందరి చూపు ఈ ఇద్దరిపైపే..!
సార్వత్రిక ఎన్నికల్లో కళ్యాణదుర్గం నియోజకవర్గంలో భారీగా పోలైన ఓట్లు ఎవరి విజయానికి కారణం అవుతాయోనన్న చర్చల నడుమ అందరి చూపు కళ్యాణదుర్గం వైపే ఉన్నట్లు తెలుస్తోంది....
దిశ, కళ్యాణదుర్గం: సార్వత్రిక ఎన్నికల్లో కళ్యాణదుర్గం నియోజకవర్గంలో భారీగా పోలైన ఓట్లు ఎవరి విజయానికి కారణం అవుతాయోనన్న చర్చల నడుమ అందరి చూపు కళ్యాణదుర్గం వైపే ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు ఉదయం నుండే బారులు తీరారు. పోలింగ్ సమయం చాలక పోవడంతో రాత్రి 12 గంటల వరకూ కొనసాగిన పోలింగ్ ప్రతిష్టాత్మకంగా నిలుస్తోంది.
పోలైన ఓట్ల వివరాలను పరిశీలిస్తే..
బ్రహ్మనముద్రంలో మొత్తం 34,763 మంది ఓటర్లు ఉండగా 31.551 మంది ఓటర్లు పాల్గొనడంతో మండల వ్యాప్తంగా 90.76 శాతం నమోదు అయింది. అలాగే కళ్యాణదుర్గం రూరల్ లో 38.550 మంది ఓటర్లుండగా 35,602 మంది ఓటర్లలో 92.35 శాతం, కళ్యాణదుర్గం అర్బన్లో 36,322 మంది ఓటర్లుండగా 28.932 మంది ఓటర్లతో 79,65 శాతం, సెట్టూరులో 34,331 మంది ఓటర్లుండగా 31,266 మంది ఓటర్లతో 91.07 శాతం, కంబదూరులో 42,875 ఓటర్లుండగా 37,963 మంది ఓటర్లతో 88.52శాతం పోలింగ్ నమోదు అయింది. విదేశాల నుంచే కాకుండా ఇతర నగరాల్లో నివాసం ఉంటున్న స్థానికులు ఉత్సాహంగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవడంతో పోలింగ్ శాతం మరింతగా పెరిగినట్లు తెలుస్తోంది. కళ్యాణదుర్గంలో వలస జీవితాలు గడుపుతున్నా.. రాజకీయంగా ఎంతో పరిణితి చెందిన ఓటర్లుగా విలక్షణమైన రీతిలో వ్యవహరిస్తుంటారనే పేరుంది. ఈ నేపథ్యంలో బీజేపీ, సీపీఐ, కాంగ్రెస్, టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలను ఆయా కాలానుగుణంగా గెలిపించిన తీరు రాజకీయం విలక్షణమైనట్లుగా ఈ ప్రాంతవాసులు భావిస్తుం టారు.
సంక్షేమ పథకాలపైనే వైసీపీ ఆశలు
ఈ నేపథ్యంలో కళ్యాణదుర్గం ప్రాంతాన్ని అభివృద్ధి చేయటమే అజెండాతోనే ఒకరు డీఆర్డీఏ పీడీగా, మున్సిపల్ కమిషనర్‌గా పనిచేసి, ప్రజల్లో గుర్తింపు పొందిన తలారి రంగయ్య ఐదేళ్లు ఎంపీగా పని చేసి, కళ్యాణదుర్గం అసెంబ్లీ అభ్యర్థిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేశారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గాలతో పాటు వాల్మీకులు అధికంగా ఉన్నారనే ఈక్వేషన్ల నడుమ తలారి రంగయ్యను వైసీపీ బరిలో దింపింది. వాల్మీకి సామాజిక వర్గంతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన సంక్షేమ పథకాలు అందుకున్న లబ్దిదారులు ప్రభుత్వానికి అండగా ఉంటారనే వ్యూహంతో ఆయన పార్టీ క్యాడర్‌ను కలుపుకుంటూ విభేదాలు దరి చేరనీయకుండా ముందుకు కదిలారు. తలారి గంగయ్య మంచివారేనే పేరుతో పాటు ఎప్పుడు వెళ్లినా కలుసుకునేందుకు అవకాశం ఇస్తారని, సమస్యలను నేరుగా విని పరిష్కార దిశగా అందుబాటులో ఉంటారనే ప్రచారం సాగింది.
అమిలినేని ఎంట్రీ ఆదిరింది
ఇదిలా ఉండగా కళ్యాణ దుర్గం ప్రాంతానికి చేరువలోనే ఉన్న పక్క ప్రాంతానికి చెందిన ప్రముఖ కాం ట్రాక్టర్ అమిలినేని సురేంద్రబాబు మూడు సార్లు రాజకీయ రంగ ప్రవేశానికి ప్రయత్నించిన చివరి క్షణంలో చేజారి పోయిన సందర్భాలు ఉన్నాయి. అయినా నిరాశ చెందకుండా సమయం కోసం వేచి ఉన్నారు. ఆయన సహ సమే ఆయనకు సార్వత్రిక ఎన్నికల్లో ఆయన కోరుకున్న కళ్యాణదుర్గం టిక్కెట్లు వరించింది. వెను కబడిన కళ్యాణ దుర్గంను అభి వృద్ధి చేయాలన్న సంక ల్పంతో సుమారు దశాబ్ద కాలంగా మరుగునపడి రైతులు ఎదురు చూస్తున్న విడిపి, కుందుర్ని బ్రాంచ్ కెనాలు ద్వారా 114 చెరువులకు సాగునీరు అందించే పథకానికి తానే కాంట్రాక్టరు అయినందున అధికారంలోకి వచ్చిన వెంటనే రెండేళ్లలో పూర్తీ చేస్తామని, గ్రామీణ రహదారులను నిర్మిస్తామని, యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించాలనే ప్రణాళికతో ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేసి, ప్రజల్లో తనపట్ల నమ్మకం కల్గించేందుకు కృషి చేశారు. శుభ ముహూర్తాన కళ్యాణదుర్గంకు అమిలినేని ఇచ్చిన ఎంట్రీ ఆదిరింది. అందరి దృష్టిని ఆకర్షిం చింది.
ఆ నమ్మకంతోనే ప్రజల్లో విశ్వాసం
అప్పటి నుండి అమిలినేని కుటుంబ సభ్యులందరూ ఊరు, వాడ తిరుగుతూ ఇంటింటి ప్రచారం సాగిస్తుంటే రోడ్లు వేస్తామంటూ వివిధ సామాజిక వర్గాల ఆత్మీయ సమావేశాలతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూ ఎన్నికల ప్రచారంలో అమిలినేని దూసుకు పోయారు. ఆర్థిక బలంతో పాటు చురుకైన నాయకత్వం ఉన్న అమిలినేని తెలుగుదేశం పార్టీ క్యాడరంతా వెంటనడవడంతో టీడీపీలో ఉన్న రెండు వర్గాల నాయకులు సహకరించక పోయినా ప్రచారంలో దూసుకుపోయారు. తన నెట్ వర్క్ ద్వారా వ్యూహాంగా రాజకీయ పావులు కదిపారు. కాలువలకు సాగునీరు తెస్తారనే ప్రచా రం ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి నమ్మకం కల్గించారు. ఆ నమ్మకమే ఆయన పట్ల ప్రజలు విశ్వాసం వ్యక్తం చేయడం గమనార్హం.
ఈ నేపథ్యంలో ఒకరు ప్రభుత్వ సంక్షేమపథకాలు, మరొకడు అభివృద్ధి చేస్తామని ప్రచారంతో పోటీ పడుతున్న ఈ ఇద్దరు ఉద్దందుల ఎన్నికల రణంలో రాష్ట్ర ప్రజల దృష్టిని ఆకర్షిం చిందనడంలో సందేహం లేదు, తలారి రంగయ్య విజ యంపైన వైకాపా అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రత్యేక దృష్టి సారిస్తే, అమిలినేని విజయంపై నారా లోకేష్ బాబు, నారా భువనే శ్వరులు పర్యటించి టీడీపీలో జోష్ నింపారు.మే 13న జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్లో 88,62 శాతం భారీగా ఓటింగ్‌లో పాల్గొన్న ఓటర్లు ఎవరివైపు మొగ్గు చూపారో అంతుచిక్కని నేపథ్యంలో గెలుపు మాదంటే మాదంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గవ్యాప్తంగా పోలింగ్ సరళిపై లెక్కలు వేస్తూ గెలుపుపై లెక్కలు వేసుకుంటున్నారు. మరి అంతుచిక్కని ఓటరు మనోగతం ఎవరి గెలుపు వైపుందో ఓట్ల లెక్కించే వరకూ ఆగాల్సిందే.