విశాఖలో ఉక్కు మంత్రి .. స్టీల్ ప్లాంట్‌ ఉత్పత్తి యూనిట్ల సందర్శన

కేంద్ర ఉక్కు శాఖామంత్రి హెచ్‌డి కుమారస్వామి సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ విశాఖలో పర్యటిస్తున్నారు. ...

Update: 2024-07-10 17:25 GMT

దిశ ప్రతినిధి, విశాఖపట్నం:  కేంద్ర ఉక్కు శాఖామంత్రి హెచ్‌డి కుమారస్వామి సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ  విశాఖలో పర్యటిస్తున్నారు. బుధవారం సాయంత్రం వీరిని  విశాఖ ఉక్కు కర్మాగారం సిఎండి అతుల్ భట్ ఘన స్వాగతం పలికారు. మంత్రులిద్దరూ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌కు గురువారం తొలిసారిగా సందర్శించనున్నారు. వారి పర్యటనలో స్టీల్ ప్లాంట్‌లోని ముఖ్యమైన ఉత్పత్తి యూనిట్లను సందర్శిస్తారు. పని తీరును పరిశీలిస్తారు. అనంతరం, ఉన్నతాధికారులతో చర్చలలో పాల్గొని విశాఖ ఉక్కు కర్మాగారం పనితీరును సమీక్షిస్తారు. స్టీల్ ఎగ్జిక్యూటివ్స్ అసోసియేషన్, ట్రేడ్ యూనియన్‌ల ప్రతినిధులతో సమావేశమౌతారు.


Similar News