గంజాయి బ్యాచ్ హల్ చల్.. పోలీసులపైకి కారు ఎక్కించి బీభత్సం

కాకినాడ జిల్లా కృష్ణవరం టోల్ ప్లాజా వద్ద గంజాయి బ్యాచ్ హల్ చల్ చేసింది..

Update: 2025-01-02 04:27 GMT

దిశ, వెబ్ డెస్క్: కాకినాడ జిల్లా(Kakinada district) కృష్ణవరం టోల్ ప్లాజా(Krishnavaram Toll Plaza) వద్ద గంజాయి బ్యాచ్ హల్ చల్ చేసింది. వాహన తనిఖీలు చేస్తున్న పోలీసులపై కారు ఎక్కించి బీభత్సం సృష్టించారు. అయితే కారులో గంజాయి(smugglers) తరలిస్తున్నారు. దీంతో కారు(Car) ఆపేందుకు పోలీసులు ప్రయత్నించారు. కానీ కారు ఆపకుండా వేగంగా కానిస్టేబుళ్లపైకి ఎక్కించి పారిపోయారు. ఈ ఘటనలో ఇద్దరు కానిస్టేబుళ్లు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. గంజాయి బ్యాచ్ సృష్టించిన బీభత్సంపై పోలీసులు సిరీయస్ అయ్యారు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా దుండగులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. నిందితులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టమని హెచ్చరించారు. 

Tags:    

Similar News