ఆ కేసులతో జగన్‌కు ఏం సంబంధం: టీడీపీ నేతలకు పేర్నినాని స్ట్రాంగ్ కౌంటర్

అదానీ కేసులతో జగన్‌కు ఏం సంబంధమని టీడీపీ నేతలకు పేర్నినాని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు..

Update: 2024-11-22 12:27 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏపీ అసెంబ్లీలో శుక్రవారం అదానీ కేసుల ప్రస్థావన జరిగింది. అయితే  అదానీ కేసుల్లో వైసీపీ అధినేత జగన్(YCP chief Jagan) పాత్రపై అసెంబ్లీలో సీఎం చంద్రబాబు నాయుడుతో పాలు పలువురు ఎమ్మెల్యేలు ప్రస్థావించారు. వ్యాపార వేత్త అదానీ(Businessman Adani)పై అమెరికా న్యూయార్క్‌(America New York)లో అవినీతి కేసు నమోదైన నేపథ్యంలో ఏపీ అసెంబ్లీ(AP Assembly)లో చర్చ జరిగింది. అవినీతి అక్రమాలపై జగన్ పేరు ఇప్పుడు విదేశాలకు ఎక్కిందని ఎద్దేవా చేశారు.  జగన్ పేరు ప్రపంచవ్యాప్తం అయిపోయిందని విమర్శించారు.
అయితే అధికార పార్టీ నేతల విమర్శలకు వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని(YCP Former Minister Perni Nani) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అదానీతో తాము ఒప్పందాలు చేసుకోలేదని తెలిపారు. అదానీని అరెస్ట్ చేస్తే అప్పటి కేంద్రమంత్రి సెబీ చైర్మన్‌ను తీసుకువెళ్తారన్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(Ys Jagan Mohan Reddy)కి ఏం సంబంధమని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) ఎప్పుడో ఇంటర్నేషనల్ లెవెల్ అవినీతిచేశారని ఆరోపించారు. సింగపూర్ మాజీ మంత్రి ఈశ్వరన్(Singapore Former Minister Eswaran) అరెస్టు గుర్తులేదా అని ప్రశ్నించారు. విద్యుత్ చార్జీలపై కేంద్ర ప్రతిపాదనలకు అంగీకరిస్తే వైసీపీపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నందుకు అప్పులే మిగిలాయని ఎద్దేవా చేశారు. చంద్రబాబు చీకట్లో కాంగ్రెస్‌తో కలిసి పని చేస్తారని వ్యాఖ్యానించారు. జగన్‌పై టీడీపీ నేతలు విషం చిమ్ముతున్నారని, వైసీపీకి 40 శాతం ఓటింగ్‌ రావటంతో ఆ ప్రజాదరణను చంపాలని చూస్తున్నారని పేర్ని నాని ఆరోపించారు.

Tags:    

Similar News