అది ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నా... లైంగిక ఆరోపణలపై స్పందించిన ఎమ్మెల్యే ఆదిమూలం

Update: 2024-09-06 04:26 GMT

దిశ, వెబ్ డెస్క్: సత్యవేడు నియోజకవర్గానికి చెందిన మహిళ చేసిన లైంగిక ఆరోపణలపై సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలంపై సస్పెన్షన్ వేటు పడిన విషయం తెలిసిందే. అయితే గురువారం నుంచి అజ్ఞాతంలో ఉన్న ఆదిమూలం ఎట్టకేలకు స్పందించారు. తనను రాజకీయంగా దెబ్బ తీయాలనే కుట్ర చేశారని ఆరోపించారు. టీడీపీ పేరుతో వైసీపీ నేతలు చేశారని వ్యాఖ్యానించారు. పార్టీ సస్పెన్షన్‌ను స్వీకరిస్తున్నానని తెలిపారు. తన వల్ల తెలుగుదేశం పార్టీకి ఎలాంటి నష్టం జరగదన్నారు. మహిళలను అడ్డంపెట్టుకుని నిందలు వేశారని చెప్పారు. అది ఆమె విజ్ఞతకే వదిలేస్తు్న్నానని ఆదిమూలం పేర్కొన్నారు. 


Similar News