రాష్ట్రంలో తగ్గిన కొత్త పాజిటివ్‌ కేసులు.. భారీగా పెరిగిన మరణాలు

Update: 2022-01-30 14:15 GMT

దిశ, ఏపీ బ్యూరో : రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య తగ్గుముఖం పడుతోంది, కానీ మరణాలు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం గత 24 గంటల్లో రాష్ట్రంలో 39,296 మందికి పరీక్షలు నిర్వహించగా వారిలో 10,310 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదయిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 22,70,491 చేరుకుంది. అయితే గత 24 గంటల్లో మహమ్మారి కారణంగా కడప, విశాఖపట్నం జిల్లాలో ముగ్గురు చొప్పున మరణించగా, నెల్లూరులో ఇద్దరు చనిపోయారు.

చిత్తూరు, గుంటూరు, ప్రకాశం మరియు శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.దీంతో కరోనాతో మరణించిన వారి సంఖ్య 14,606 గా ఉంది. ఇకపోతే ప్రస్తుతం రాష్ట్రంలో 1,16,031 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 3,24,45,428 సాంపిల్స్‌‌ని పరీక్షించడం జరిగిందని వైద్య ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. వైరస్‌ వ్యాప్తి తగ్గుతున్నా, మరణాల సంఖ్య పెరుగుతోందనీ, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

Tags:    

Similar News