నెల్లూరు గడ్డ వైసీపీ అడ్డా! మరోసారి నిరూపించిన వైఎస్సార్సీపీ శ్రేణులు..
పార్లమెంట్ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఖరారు చేసిన అనంతరం తొలిసారిగా నెల్లూరుకు విచ్చేసిన వేణంబాక విజయసాయిరెడ్డికి నెల్లూరు రూరల్ వైఎస్సార్సీపీ శ్రేణులు అఖండ ఘన స్వాగతం అందించారు.
దిశ,డైనమిక్ నెల్లూరు: పార్లమెంట్ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఖరారు చేసిన అనంతరం తొలిసారిగా నెల్లూరుకు విచ్చేసిన వేణంబాక విజయసాయిరెడ్డికి నెల్లూరు రూరల్ వైఎస్సార్సీపీ శ్రేణులు అఖండ ఘన స్వాగతం అందించారు. నియోజకవర్గంలోని అయ్యప్ప గుడి సెంటర్ సమీపంలోని జాతీయ రహదారి వద్ద నెల్లూరు రూరల్ నియోజకవర్గం గ్రామీణ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి సారథ్యంలో రూరల్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ స్థాయిలో వైసీపీ పార్లమెంట్ అభ్యర్థికి అపూర్వ స్వాగతం పలికారు.ఈ క్రమంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ప్రతి సెంటర్లో భారీ గజమాలతో వైసీపీ శ్రేణులు ఎంపీ అభ్యర్థి వి. విజయసాయిరెడ్డికి ఘన స్వాగతం పలికారు. వీఆర్సీ సెంటర్లో భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి, గాంధీ బొమ్మ సెంటర్లో జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి, దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి, ఆత్మకూరు బస్టాండ్ సెంటర్లో అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహాలకు నెల్లూరు పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి వి. విజయసాయిరెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా నెల్లూరు కి విచ్చేసిన విజయసాయిరెడ్డి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని జాతీయ రహదారి నుంచి రామ్మూర్తి నగర్ లోని నెల్లూరు ఎంపీ అభ్యర్థి కార్యాలయం వరకు టాప్ లేని జీబులో రోడ్ షో నిర్వహించి ప్రజలకు రెండు చేతులు జోడించి ఆప్యాయంగా పలకరిస్తూ అభివాదం చేశారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు యాదవ్, జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, మేకపాటి విక్రమ్ రెడ్డి, నరసరావుపేట పార్లమెంట్ ఇన్చార్జ్ డాక్టర్ పి అనిల్ కుమార్ యాదవ్, నగర మేయర్ పొట్లూరు స్రవంతి జయవర్ధన్, నగర వైసీపీ ఇన్చార్జి మహమ్మద్ ఖలీల్ అహ్మద్, ఉదయగిరి ఇన్ఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి, విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, నెల్లూరు నగర వైసీపీ అధ్యక్షుడు సన్నపురెడ్డి పెంచలరెడ్డి, జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్, డివిజన్ ఇన్చార్జిలు, నాయకులు కార్యకర్తలు, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Read More..
రాష్ట్రం విడిపోవడానికి కారణం ఆయనే.. మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు