MP Raghu Rama Raju: సింహం అంటే పరదాలా వెనుక దాక్కోవడమా..?

తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనను పోలీసులు అడ్డుకోవడంపై వైసీపీ అసమ్మతి ఎంపీ రఘురామ కృష్ణంరాజు స్పందించారు...

Update: 2023-02-18 12:50 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనను పోలీసులు అడ్డుకోవడంపై వైసీపీ అసమ్మతి ఎంపీ రఘురామ కృష్ణంరాజు స్పందించారు. చంద్రబాబు కాన్వాయ్‌కు అడ్డుపడి మరీ పోలీసులు పర్యటనను అడ్డుకోవడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలను తాను ఎప్పుడూ చూడలేదని చెప్పుకొచ్చారు. ఈ ఘటనలను చంద్రబాబుపై దాడిగానే పరిగణించాలని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ తనను తాను సింహంగా అభివర్ణించుకుంటారని.. సింహం ఎవరో అనపర్తిలో తెలిసిపోయిందని సెటైర్లు వేశారు. పరదాల చాటున వచ్చేవారిని సింహం అంటారా...? అని సందేహం వ్యక్తం చేశారు. చంద్రబాబు సింహం కాబట్టే వైసీపీ ప్రభుత్వం భయపడి పర్యటనలను అడ్డుకుంటుందని ధ్వజమెత్తారు.

వైసీపీ ఓడిపోవడం ఖాయం

 రాబోయే రోజుల్లో వైసీపీ దారుణంగా ఓడిపోవడం ఖాయమని ఎంపీ రఘురామ జోస్యం చెప్పారు.  ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీకి కనీసం 25 సీట్లు కూడా వచ్చే అవకాశాలు కనిపించడం లేదని చెప్పుకొచ్చారు. ఇప్పటికే సర్వేలు సైతం అవే చెబుతున్నాయని దీంతో సీఎం జగన్ క్యాడర్ ఫ్రస్టేషన్‌లోకి వెళ్లిపోయి చంద్రబాబు పర్యటనను అడ్డుకుంటున్నారని అసమ్మతి ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఆరోపించారు

Also Read...

Mla Sridhar Reddy: సజ్జల షాడో సీఎం.. ఎంత వేధించినా తగ్గెదేలే! 

Tags:    

Similar News