Big Breaking: సీఎం జగన్ ఫ్యామిలీ పై నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు
నారా లోకేష్ ని మనీ ల్యాండరింగ్ కేసులో US పోలీసులు అరెస్ట్ చేశారు అనే వార్త సోషల్ మీడియా వేదికగా హలచల్ చేస్తోంది.
దిశ, డైనమిక్ బ్యూరో:గత కొద్ది రోజులుగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ ని మనీ ల్యాండరింగ్ కేసులో US పోలీసులు అరెస్ట్ చేశారు అనే వార్త సోషల్ మీడియా వేదికగా హలచల్ చేస్తోంది.కాగా ఈ వార్తపై స్పందించిన టీడీపీ లోకేష్ గురించి జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని.. ఆయన పార్టీ కార్యకలాపాల కోసం NRI ల నుండి పార్టీకి కావాల్సిన నిధులను సేకరించడం కోసం అమెరికా వెళ్లారని తెలిపారు.
అయితే తాజాగా ఇదే విషయం పై నారా లోకేష్ స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మిమ్మల్ని US పోలీసులు అరెస్ట్ చేసినట్లు జగన్ పేర్కొంటున్నారని మీడియా అడిగిన ప్రశ్నకు నారా లోకేష్ ఘాటుగా సమాధానం ఇచ్చారు. ఎవర్ని..? జనగ్ నా..? జగన్ కూతురినా..? లేక భారతీ రెడ్డినా..? అని ఎద్దేవ చేశారు. కాగా వైసీపీ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు అని మీడియా పర్సన్ ప్రశించారు.
ఆ ప్రశ్నకు సమాధానంగా ఆ గాడిదలనే అడగండి అని లోకేష్ పేర్కొన్నారు. ఆ సంధానం విన్న అయన అభిమానులు వర్ధిల్లాలి లోకేష్ బాబు నాయకత్వం అని నినాదాలు చేశారు. ఇంకా సమాధానం కావాలా..? ఆ పోస్ట్లు పెట్టినవాళ్లనే అడగండి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం లోకేష్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ వీడియో ని మీరు ఒకసారి చూసేయండి.
"ఎవరిని ? జగన్ నా ? భారతీ రెడ్డినా ? జగన్ కూతురినా ? ప్రచారం చేసిన ఆ గాడిదలనే అడగండి.. మనీ ల్యాండరింగ్ అనేది వాడికి తెలిసిన విద్య.. "
— Telugu Desam Party (@JaiTDP) January 27, 2024
బులుగు బ్యాచ్ కి, నారా లోకేష్ పంచ్ #WhyAPHatesJagan #2024JaganNoMore #YCPFakeBrathuku pic.twitter.com/wPqlJ1UPOu