అబ్బాయే బాబాయిని చంపేశాడు.. నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు

ఈ రోజు నరసన్నపేటలో నిర్వహించిన శంఖారావం బహిరంగ సభలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రసంగించారు.

Update: 2024-02-12 09:01 GMT

దిశ డైనమిక్ బ్యూరో:  ఈ రోజు నరసన్నపేటలో నిర్వహించిన శంఖారావం బహిరంగ సభలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రసంగించారు. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలను ఒక ప్రశ్నను అడుగుతాను సమాధానం చెప్తారా అని.. బాబాయిని చంపింది ఎవరు? పిన్ని తాళిబొట్టు తెంపింది ఎవరు? అని లోకేష్ అడిగారు.

అలానే అబ్భాయే బాబాయిని చంపారని.. ఇది జగణాసుర రక్త చరిత్ర అని పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు చంపినట్లు ఆరోపించారని.. ఇక ఈ రోజు ఛార్జ్ షీట్ లో వైసీపీ నేత సొంత బంధువు అవినాష్ రెడ్డి A 8 ముద్దాయి అని.. రేపోమాపో A 9 లో జునాగన్మోహన్ రెడ్డి ఉంటారని పేర్కొన్నారు. ఇక ప్రజలకు చిన్న క్విజ్ పెడతాను అని.. ప్రతి రోజు జగన్ ఏం తాగుతారు అంటూ ఆప్షన్స్ ఇచ్చారు.

ఈ ఆప్షన్స్ లో చివరి ఆప్షన్ గా ఇచ్చిన ప్రజల రక్తం సరైన సమాధానంగా తెలిపారు. ఇక మద్యం బాటిల్ పైన j టాక్స్ అంటే జగన్ పన్ను కటించుకుంటున్నారని ఎద్దేవ చేసారు. అలా వసూలు చేసే టాక్స్ డైరెక్ట్ గా జగన్ జోబులోకి వెళ్తుందని.. 5 ఏళ్లలో మద్యం సేవించే ప్రతి ఒక్కరు 45 వేల రూపాయలు జగన్ టాక్స్ రూపంలో వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇక ఈ రోజు మార్కెట్ లో లభ్యమవుతున్న మద్యం విషం కంటే ప్రమాదం అని పేర్కొన్నారు.


Tags:    

Similar News