Nara Lokesh: నారా లోకేష్ ఐఫోన్ హ్యాక్.. సెక్యూరిటీ అలర్ట్ పంపిన యాపిల్ సంస్థ (ఫొటోలు వైరల్)
ఓ వైపు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను ఊపేస్తోంది.
దిశ, వెబ్‌డెస్క్: ఓ వైపు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను ఊపేస్తోంది. ఇప్పటికే ఆ కేసులో పలువురు పోలీసు ఉన్నతాధికారులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ క్రమంలో ఏపీలో సార్వత్రిక ఎన్నికల వేళ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫోన్ హ్యాక్‌కు గురైన విషయం కలకలం రేపుతోంది. ఇప్పటికే యాపిల్ సంస్థ కూడా ఆయన ఫోన్‌కు సెక్యూరిటీ అలర్ట్‌తో పాటు ఈ మెయిల్ కూడా పంపింది. ‘మీ హ్యాండ్ సెట్ ట్యాపింగ్, హ్యాకింగ్ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని లోకేష్‌ను అలర్ట్ చేసింది. ఈ క్రమంలో ఓటిమి భయంతో అధికార పార్టీ కుట్రలకు పాల్పడుతోందని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రతిపక్ష నాయకుల ఫోన్లను హ్యాక్, ట్యాపింగ్ చేసి ఎలాగైనా విజయం సాధించాలనే దుర్భుద్ధితో ఫ్యాను పార్టీ ఇలాంటి సిగ్గుమాలిన పనులకు ఒడిగట్టిందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే, నిజంగానే లోకేష్ ఫోన్ హ్యాక్ అయిందా.. లేక ట్యాపింగ్ చేశారా అన్న విషయం ప్రస్తుతం ఏపీ పొలిటికల్ సర్కిల్‌లో హాట్ టాపిక్‌గా మారింది.