Breaking: ఆ ప్రాంతంలో నారా లోకేష్ భూమిపూజ.. దానికోసమేనా..?
ఇప్పటివరకు పొత్తులపై ద్రుష్టి సారించిన టీడీపీ ఇప్పుడు పొత్తులు ఖరారు అయిన నేపథ్యంలో పార్టీ ప్రచారంపై దృష్టిసారించింది.
దిశ వెబ్ డెస్క్: ఇప్పటివరకు పొత్తులపై ద్రుష్టి సారించిన టీడీపీ ఇప్పుడు పొత్తులు ఖరారు అయిన నేపథ్యంలో పార్టీ ప్రచారంపై దృష్టిసారించింది. రానున్న ఎన్నికల్లో విజయభేరిని మోగించేందుకు త్రికూటమి సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి తొలిసభను సమన్వయంతో విజయవంతం చేసేందుకు మూడు పార్టీలు ప్రణాళికలు రూపొందిస్తున్నాయి.
ఇక చిలకలూరిపేట లో త్రికూటమి నిర్వహించనున్న సభ ద్వారా జగన్ పతనానికి నాంది పలుకుతామని త్రిపార్టీ అధినేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సమయం తక్కువగా ఉన్న భారీ ఏర్పాట్లకు వ్యూహ రచన చేస్తున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ నెల 17వ తేదీన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పర్యటనకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పచ్చ జెండా ఊపారు.
ఈ నేపథ్యంలో 17వ తేదీ జగనున్న సభకు ఏర్పాట్లు చేసేముందు ఆ దేవుని ఆశీసులు ఉండాలని ఈ రోజు చిలకలూరిపేటలోని బొప్పూడి లో భూమిపూజ నిర్వహిస్తున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, అలానే మూడు పార్టీల ముఖ్య నేతలు భూమిపూజను నిర్వహిస్తున్నారు. కాగా ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
ఇక చిలకలూరిపేటలో ఈ నెల 17వ తేదీ సాయంత్రం 5 గంటలకు జరగనున్న తెలుగుదేశం-బీజేపీ-జనసేన ఉమ్మడి సభకు ప్రధాని నరేంద్ర మోడీ హాజరు కానున్నారు. కాగా ఈ సభలో మూడు పార్టీల అధినేతలు సభావేదికపై ఉండనున్నారు. దీనితో త్రికూటమి ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సభ నిర్వాహణపై ఇప్పటికే ఉమ్మడిగా కమిటీలు ఏర్పాటు చేశారు. అలానే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది తరలి వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు.