చంద్రబాబుకు మద్దతుగా నందమూరి సుహాసిని నిరాహార దీక్ష
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ను నిరసిస్తూ అక్టోబర్ 2న శాంతి యుతంగా నిరాహార దీక్ష చేస్తున్నట్లు నందమూరి సుహాసిని ప్రకటించారు.
దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ను నిరసిస్తూ అక్టోబర్ 2న శాంతి యుతంగా నిరాహార దీక్ష చేయాలని నందమూరి సుహాసిని నిర్ణయించుకున్నారు. గాంధీ జయంతి రోజున తన అక్రమ అరెస్ట్‌ను నిరసిస్తూ నారా చంద్రబాబు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఒక్కరోజు నిరాహార దీక్ష చేయనున్నారు. అలాగే ఆయనకు మద్దతుగా నారా భువనేశ్వరీ, నారా లోకేశ్‌లు సైతం చేయబోతున్నారు. వీరికి సంఘీభావంగా అక్టోబర్ 2న హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టనున్నట్టు నందమూరి సుహాసిని ప్రకటించారు. ‘వీ ఆర్ విత్ సీబీఎన్’ అంటూ నిరసనకు దిగనున్నారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు అనుచరులు, ఐటీ ఉద్యోగులు, మద్ధతుదారులు పాల్గొనాలని నందమూరి సుహాసిని కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్టాడుతూ రాజకీయ కక్షలో భాగంగానే చంద్రబాబు నాయుడును అకారణంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు.23 రోజులుగా చట్టవిరుద్ధంగా చంద్రబాబును నిర్బంధించారని ఈ కష్టకాలంలో ఆ కుటుంబానికి సంఘీభావం ప్రకటించాలని నందమూరి సుహాసిని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.