ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్పు.. Nandamuri Kalyan Ram కీలక వ్యాఖ్యలు
ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్పు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
దిశ, వెబ్‌డెస్క్: ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్పు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలో టీడీపీ నేతలు తీవ్రంగా నిరసనలు చేస్తున్నారు. ఈ అంశంపై తాజాగా నటుడు జూనియర్ ఎన్‌టీఆర్ కూడా ట్విట్టర్ వేదికగా స్పందించిన సంగతి తెలిసిందే. అనంతరం ఈ విషయంపై నందమూరి కల్యాణ్ రామ్ ట్విట్టర్‌లో ఆవేదన వ్యక్తం చేశారు.
''1986లో విజయవాడలో మెడికల్ యూనివర్సిటీ స్థాపించబడింది. ఆంధ్రప్రదేశ్‌లోని 3 ప్రాంతాల విద్యార్థులకు నాణ్యమైన వైద్య, విద్యను అందుబాటులోకి తీసుకురావాలని కోరుకున్న శ్రీఎన్టీఆర్ గారు ఈ మహావిద్యలయానికి అంకురార్పణ చేశారని అన్నారు. ఈ వైద్య ఆరోగ్య విశ్వవిద్యాలయం దేశంలోనే అత్యుత్తమంగా అభివృద్ధి చెందిందని.. లెక్కలేనన్ని నైపుణ్యం కలిగిన వైద్య నిపుణులను దేశానికి అందించింది'' అని హర్షం వ్యక్తం చేశారు. అయితే, తెలుగు రాష్ట్రాలలో వైద్య అధ్యయనాల మెరుగుదలకు ఆయన చేసిన కృషిని స్మరించుకునేందుకు విశ్వవిద్యాలయానికి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అని పేరు మార్చబడిందని కొనియాడారు. ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ 25 ఏళ్లకు పైగా ఉనికిలో ఉన్న ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయం పేరును మార్చడం నాకు బాధ కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం రాజకీయ లాభం కోసం చాలా మందికి భావోద్వేగాలతో ముడిపడివున్న ఈ అంశాన్ని వాడుకోవడం తప్పు అని నటుడు కల్యాణ్ రామ్ అసహనం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి :
NTR హెల్త్ యూనివర్సిటీ పేరును తొలిగించడంపై స్పందించిన Jr. NTR