Nagarjuna Sagar:నాగార్జున సాగర్ 4 గేట్లు ఎత్తి నీటి విడుదల

ఎగువన కురుస్తున్న వర్షాలతో నాగార్జునసాగర్‌కు వరద ప్రవాహం వచ్చి చేరుతోంది.

Update: 2024-10-16 08:15 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎగువన కురుస్తున్న వర్షాలతో నాగార్జునసాగర్‌కు వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్టు 4 క్రస్ట్ గేట్లు ఎత్తి 32,400 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 76,555 క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుత, పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులుగా నమోదైంది. సాగర్ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 312.0450 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ కూడా 312.0450 టీఎంసీలుగా ఉంది.


Similar News