దూసుకొస్తున్న వాయుగుండం.. చైన్నైకి రెడ్ అలర్ట్

తమిళనాడు, ఏపీలపైకి వాయుగుండం దూసుకొస్తుంది.

Update: 2024-10-16 12:00 GMT

దిశ, వెబ్ డెస్క్ : తమిళనాడు, ఏపీలపైకి వాయుగుండం దూసుకొస్తుంది.తమిళనాడు, ఏపీలపైకి వాయుగుండం దూసుకొస్తుంది. నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం ప‌శ్చిమ వాయువ్య దిశగా కదులుతూ చెన్నైకి 280 కీలోమీటర్లు, పుదుచ్చేరికి 320 కిలోమీటర్లు, నెల్లూరుకు 370కీలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. దీంతో వాతావరణ శాఖ చెన్నై నగరానికి, ఏపీ, తమిళనాడులోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. పశ్చిమ వాయవ్య దిశగా గంట‌కు 15 కి.మి వేగంతో వాయుగుండం దూసుకోస్తుంది. దీని ప్రభావంతో దక్షిణకోస్తా, రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్ష సూచన చేసింది. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉందని పేర్కొంది.

లోతట్టు ప్రాంతాల‌ ప్రజలు, పెన్నా పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమ‌త్తంగా ఉండాల‌ని ఐఎండీ అధికారులు హెచ్చరించారు. పెన్నా పరివాహక ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. సహాయక చర్యల కోసం 5 ఎస్డీఆర్ఎఫ్, 2 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధం చేశారు. అవసరమైన చోట పునరావాస సెంటర్లను ఏర్పాటు చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. రేపు ఉదయం పుదుచ్చేరి, నెల్లూరు మధ్య తీరం దాటే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. 


Similar News