వైసీపీ ఓటమికి జగనే కారణం... రాపాక సెన్సేషనల్ కామెంట్స్

వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు సెన్సేషనల్ కామెంట్స్ చేశారు..

Update: 2024-10-16 11:57 GMT

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి(Ycp Chief Jagan Mohan Reddy)పై మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు(Former Mla Rapaka VaraPrasad) సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓటమికి జగనే కారణమని ఆయన ఆరోపించారు. పార్టీ ఓడిపోవడానికి కోటరీ కాదని తేల్చి చెప్పారు. జగన్ మోహన్ రెడ్డి ఎవరి మాట వినకపోవడం వల్లే పార్టీ ఘోరంగా ఓడిపోయిందన్నారు. జగన్ను కలవాలంటే ఆరు నెలల సమయం పడుతుందని, కొందరికైతే ఆ అవకాశం కూడా ఉండదని రాపాక వరప్రసాద్ తెలిపారు.

కాగా రాపాక వరప్రసాద్ 2019 ఎన్నికల్లో జనసేన(Janasena) తరపున తూర్పుగోదావరి జిల్లా రాజోలు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ సమయంలో జనసేన, టీడీపీ(Tdp) ఘోరంగా ఓటమి పాలైంది. వైసీపీ(Ycp) 151 సీట్లతో ఘన విజయం సాధించింది. దాంతో రాపాక వరప్రసాద్ జనసేనకు గుడ్ బై చెప్పి వైసీపీలో చేరారు. అప్పటి నుంచి వైసీపీలోనే కొనసాగారు. అయితే ఇటీవల కాలంలో ఆయన వైసీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. వైసీపీకి రాజీనామా చేస్తానని ప్రకటించారు. త్వరలోనే భ్యవిష్యత్ కార్యాచరణపై స్పష్టం చేస్తానని తెలిపారు. ఇంతలోనే మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్‌పై రాపాక వరప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

Read More : ఢిల్లీ ఎయిర్‌పోర్టు ఘటనపై సజ్జల తీవ్ర ఆవేదన


Similar News