AP News:డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాలతో 44 గ్రామాల్లో నీటి శాంపిల్స్ సేకరణ

ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ది దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో రాష్ట్ర మంత్రులు పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

Update: 2024-10-16 11:12 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ది దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో రాష్ట్ర మంత్రులు పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) రూరల్ డెవలప్‌మెంట్(Rural Development) పై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాలతో కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలోని 44 గ్రామాల్లో గ్రామీణ నీటిపారుదల శాఖ అధికారులు నీటి శాంపిల్స్(Water Samples) సేకరిస్తున్నారు. గుడివాడ రూరల్, నందివాడ, గుడ్లవల్లేరు మండలాల్లో మూడు బృందాలుగా అధికారులు శాంపిల్స్ సేకరిస్తున్నారు.

ఈ సందర్భంగా RWS ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నటరాజ్ మాట్లాడుతూ.. 44 గ్రామాల్లో తాగునీటి వనరుల నాణ్యతను పరిశీలిస్తున్నామని చెప్పారు. ఇక వాటర్ వర్క్స్‌లో సేకరించిన శాంపిల్స్ ల్యాబ్‌లో పరీక్షిస్తున్నామని నటరాజ్ తెలిపారు. రేపు(గురువారం) సాయంత్రం వరకు పూర్తి స్థాయిలో రిపోర్టులు అధికారులకు అందజేస్తాం అన్నారు. ఈ క్రమంలో మూడు సంవత్సరాలుగా రిపేర్లు లేకపోవడంతో ఫిల్టర్ బెడ్లు పూర్తిగా పాడయ్యాయి. ఫిల్టర్ బెడ్లు నీటిని శుద్ధి చేయలేకపోతున్నాయని ఆయన తెలిపారు. ఫిల్టర్ బెడ్లను మరమ్మతులు చేసేందుకు 3.30 కోట్ల రూపాయలతో అంచనాలను ఉన్నతాధికారులకు పంపామని వెల్లడించారు.


Similar News