సొంతిళ్లే చక్కదిద్దుకోలేరు.. దేశానికి ఏం చేస్తారు..? కాంగ్రెస్‌పై విజయసాయిరెడ్డి సెటైర్లు

కాంగ్రెస్ పార్టీపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి సెటైర్లు వేశారు. హిమాచల్ ప్రదేశ్‌లో రాజ్య సభ ఎన్నికలు ఎలా జరిగాయో చూశామని..

Update: 2024-02-28 11:40 GMT

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ పార్టీపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి సెటైర్లు వేశారు. హిమాచల్ ప్రదేశ్‌లో రాజ్య సభ ఎన్నికలు ఎలా జరిగాయో చూశామని.. సొంతిల్లే చక్కదిద్దుకోలేని వాళ్లు.. దేశ ప్రజలకు వాగ్దానాలు చేసి ఎలా గెలుస్తారని ఎద్దేవా చేశారు. దేశంలో కాంగ్రెస్ విచ్ఛిన్నమవుతోందని అనడానికి.. హిమాచల్ రాజ్య సభ ఎన్నికలే నిదర్శమని విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు. కాగా, హిమాచల్ ప్రదేశ్‌లో రాజకీయ సంక్షోభం నెలకొంది. మంగళవారం జరిగిన రాజ్య ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ వేశారు. దీంతో కాంగ్రెస్ గెలవాల్సిన రాజ్య సభ సీటు అనుహ్యంగా బీజేపీ దక్కించుకుంది. బీజేపీ అభ్యర్థికి ఓటు వేసిన అభ్యర్థులు ఆ పార్టీతో టచ్‌లోకి వెళ్లారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీజేపీ హర్యానాకు తరలించింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం విశ్వాసం కోల్పోయిందని బీజేపీ ప్రకటించింది. అసెంబ్లీలో అవిశ్వాసం తీర్మానం పెట్టేందుకు బీజేపీ ప్లాన్ చేస్తుండటంతో హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ సర్కార్ కూలిపోయే ప్రమాదం నెలకొంది. ఈ క్రమంలో హిమాచల్‌లో సంక్షోభంలో పడిన కాంగ్రెస్‌ను ఎంపీ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. 

Read More..

వైసీపీ గూటికి చేరిన మాజీమంత్రి గొల్లపల్లి.. చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు

Tags:    

Similar News