MP Vijayasai Reddy: తప్పు చేస్తే నిరభ్యంతరంగా అరెస్ట్ చేసుకోండి.. ఎంపీ విజయసాయి రెడ్డి ఘాటు వ్యాఖ్యలు
జమిలి ఎన్నికల బిల్లు (Jamili Election Bill)కు ఇటీవలే కేంద్ర కేబినెట్ (Central Cabinet) ఆమోదం తెలిపింది.
దిశ, వెబ్‌డెస్క్: జమిలి ఎన్నికల బిల్లు (Jamili Election Bill)కు ఇటీవలే కేంద్ర కేబినెట్ (Central Cabinet) ఆమోదం తెలిపింది. ఈ పార్లమెంట్ (Parliament) సమావేశాల్లోనే బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపజేసేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలోనే జమిలి ఎన్నికల (Jamili Elections)పై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి (Vijayasai Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం భయానక వాతావరణం సృష్టిస్తోందిని అన్నారు. తమపై, వైసీపీ (YCP) కార్యకర్తలు, నాయకులపై అక్రమంగా కేసులు పెట్టేందుకు ప్లాన్ చేస్తుందని ఆరోపించారు. అసలు కేవీ రావు (KV Rao) ఎవరో తనకు తెలియదని.. విశాఖ (Vishakha)లో తాను భూమి కబ్జా చేయలేదని క్లారిటీ ఇచ్చారు. తమ బంధువులు భూములు కొనుగోలు చేస్తే.. తనపై దష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
అదేవిధంగా తనపై లుక్ అవుట్ నోటీసు (Lookout Notice)లు ఇవ్వాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పిలిస్తే తానే స్వయంగా వస్తానని.. తప్పు చేస్తే నిరభ్యంతరంగా అరెస్ట్ చేసుకొవచ్చని అన్నారు. అక్రమ కేసులకు వైసీపీ (YCP) నేతలు, కార్యకర్తలు భయపడాల్సిన అవసరం లేదని.. అవసరం అయితే జైలుకు వెళ్దామని, కానీ భయపడి పార్టీ మారకూడదని తెలిపారు. జమిలి ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ వస్తుందంటూ తాను ముందే చెప్పానని గుర్తు చేశారు. 2027లో తప్పకుండా ఎన్నికలు జరుగుతాయి జోస్యం చెప్పారు. బీజేపీ (BJP)కి పరిస్థితులు అనుకూలంగా లేకపోతే తప్ప.. 2027 సెప్టెంబర్‌లోనే ఎన్నికలు ఉంటాయని అన్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ (YCP) నేతలు, కార్యకర్తలు అందరూ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ విజయాన్ని ఎవరూ ఆపలేరని విజయసాయి రెడ్డి అన్నారు.