ఎంపీ రఘురామకు హైకోర్టులో షాక్ .. విచారణ నుంచి తప్పుకున్న జడ్జి
స్కిల్ స్కాం కేసులో అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి, సీఐడీ చీఫ్ సంజయ్ సర్వీసు నిబంధనలు ఉల్లంఘించారంటూ వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఏపీ హైకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ వేశారు.
దిశ, డైనమిక్ బ్యూరో : స్కిల్ స్కాం కేసులో అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి, సీఐడీ చీఫ్ సంజయ్ సర్వీసు నిబంధనలు ఉల్లంఘించారంటూ వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఏపీ హైకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ వేశారు. ఈ ఇంప్లీడ్ పిటిషన్‌పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. అయితే ఈ కేసు విచారణ నుంచి జస్టిస్ రఘునందన్ తప్పుకున్నారు. నాట్ బిఫోర్ మీ అంటూ విచారణ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఇంప్లీడ్ పిటిషన్‌ను సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ రఘునందన్ విచారించింది. అయితే జస్టిస్ రఘు నందన్ నాట్ బిఫోర్‌మీ అనడంతో రఘురామ వేసిని పిటిషన్‌ను ఏ బెంచ్ విచారించాలో సీజే నిర్ణయించనున్నారు. వేరే బెంచ్‌కు విచారణ వచ్చేలా చర్యలు తీసుకోవాలని సీజే హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించారు. ఇకపోతే ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి, సీఐడీ చీఫ్ సంజయ్‌లు నిబంధనలు ఉల్లంఘించి స్కిల్ స్కాం కేసులో మీడియా సమావేశాలు నిర్వహించారని ఎంపీ రఘు రామ కృష్ణంరాజు ఇంప్లీడ్ పిటిషన్‌లో ఆరోపించారు.
వేరే బెంచ్‌కు బదిలీ చేయాలని సీజే ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్‌లో స్కిల్ డవలప్‌మెంట్ స్కాం కేసు సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 52 రోజులుగా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. అనారోగ్యం కారణాలతో చంద్రబాబు నాయుడు మధ్యంతర బెయిల్‌పై విడుదలయ్యారు. ఇకపోతే ఈ స్కిల్ స్కాం కేసులో అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి, సీఐడీ చీఫ్ సంజయ్ సర్వీసు నిబంధనలు ఉల్లంఘించారంటూ వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇదే అంశంపై గతంలో యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్టీఐ క్యాంపెయిన్ అధ్యక్షుడు సత్యనారాయణ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ పిల్ పై విచారణలో వాదనలు వినిపించేందుకు తనకు కూడా అవకాశం కల్పించాలని ఎంపీ రఘురామ తాజాగా ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. ఏఏజీ పొన్నవోలు, సీఐడీ చీఫ్ సంజయ్ నిబంధనలకు విరుద్ధంగా స్కిల్ కేసుపై మీడియా సమావేశాలు నిర్వహించారని రఘురామ తన ఇంప్లీడ్ పిటిషన్‌లో ఆరోపించారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ కేసు విచారణ నుంచి న్యాయమూర్తి రఘునందన్ తప్పుకున్నారు. దీంతో కేసు విచారణను వేరే బెంచ్‌కు బదిలీ చేయాలని హైకోర్టు రిజిస్ట్రీని సీజే ఆదేశించారు.