TDP: ఢిల్లీలో జగన్ ధర్నా వెనక అసలు కారణం అదే: MP లావు శ్రీకృష్ణదేవరాయలు

దేశ రాజధాని ఢిల్లీలో ధర్నా చేస్తానన్న వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌పై వ్యాఖ్యలపై టీడీపీ పార్లమెంటరీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు ఫైర్

Update: 2024-07-21 10:14 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో ధర్నా చేస్తానన్న వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌పై వ్యాఖ్యలపై టీడీపీ పార్లమెంటరీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు ఫైర్ అయ్యారు. ఆదివారం ఢిల్లీలోని పార్లమెంట్ భవనంలో జరిగిన అఖిలపక్ష భేటీలో పాల్గొన్న శ్రీకృష్ణదేవరాయలు అనంతరం మీడియాతో మాట్లాడారు. వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో చేసిన తప్పులు బయటకు వస్తాయనే భయంతోనే జగన్ ఢిల్లీలో ఆందోళన చేస్తామంటున్నాడని సెటైర్ వేశారు. ఏపీలో ఎలాంటి శాంతిభద్రతల సమస్య లేదని జగన్ కామెంట్స్‌కు కౌంటర్ ఇచ్చారు.

వైసీపీ ఏపీ రాజధాని అమరావతి, పోలవరం అంశాలపై మాట్లాడకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక, ఏపీ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్ అయిన విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు మేం సిద్ధంగా లేమని స్పష్టం చేశారు. అమరావతి, పోలవరం నిర్మాణాలు పూర్తి చేయడానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. 2024 ఎన్నికల్లో టీడీపీ అద్భుతమైన విజయం సాధించిందన్నారు. ఏపీ నుండి 21 మంది ఎన్డీఏ కూటమి ఎంపీలు ఉంటే అందులో 16 మంది టీడీపీ సభ్యులే ఉన్నారని చెప్పారు. ఏపీ ఆర్థిక వ్యవస్థ గురించి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో వివరిస్తామని తెలిపారు.


Similar News