Y. S. Avinash Reddy : సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాశ్ రెడ్డి

మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో నిందితుడిగా ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి సీబీఐ కోర్టు వద్దకు చేరకున్నారు.

Update: 2023-08-14 05:39 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో నిందితుడిగా ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి సీబీఐ కోర్టుకు చేరుకున్నారు. వైఎస్ వివేకా హత్యకేసులో 8వ నిందితుడిగా సీబీఐ చార్జిషీట్‌లో ఎంపీ అవినాశ్ రెడ్డిని పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి ఇటీవలే సీబీఐ అనుబంధ చార్జిషీట్లను దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆగష్టు 14న విచారణకు హాజరుకావాలని సీబీఐ కోర్టు నోటీసులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం ఎంపీ అవినాశ్ రెడ్డి నాంపల్లిలోని సీబీఐ కోర్టుకు చేరుకున్నారు. ఎంపీ అవినాశ్ రెడ్డి వెంట అభిమానులు భారీగా తరలివచ్చారు. ఇదిలా ఉంటే జూన్ 19న సీబీఐ డైరెక్టర్‌కు ఎంపీ అవినాశ్ రెడ్డి లేఖ రాశారు. సీబీఐ దర్యాప్తు ను పునః సమీక్షించాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. ఈ కేసుకు సంబంధించి గతంలో విచారణాధికారిగా పనిచేసిన రాంసింగ్‌పై ఆరోపణలు చేశారు. తనను టార్గెట్ చేస్తూ విచారణ చేపట్టారని... ఆయన హయాంలో సీబీఐ దర్యాప్తు సక్రమంగా జరగలేదని లేఖలో ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే ఈ లేఖలో సీబీఐ స్పందించలేదన్న విషయం తెలిసిందే.

 వైఎస్ భాస్కర్ రెడ్డి సైతం 

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో భాగంగా ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్న నిందితులు వైఎస్ భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, గంగిరెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి, ఉమా శంకర్ రెడ్డి, సునీల్ యాదవ్‌లను జైలు అధికారులు సీబీఐ కోర్టులో హాజరుపరిచారు. 

Tags:    

Similar News