దారుణం.. రూ.10 వేలకే పసి పాప అమ్మకం
ప్రకాశం జిల్లా ఒంగోలులో పసిపాపను అమ్మ అమ్మేశారు..
దిశ, వెబ్ డెస్క్: ఓ తల్లి తన కన్నపేగు బంధాన్ని మరిచిపోయారు. ముక్కుపచ్చలారని పసిబిడ్డను అమ్మకానికి పెట్టారు. పొత్తిళ్లలోని కూతురిని డబ్బులకు విక్రయించారు. ఈ దారుణం ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగింది. ఓ అంగన్ వాడీ కార్యకర్త ఒంగోలు రిమ్స్ ఆస్పత్రిలో పసిపాపకు జన్మనిచ్చారు. అయితే ఆమె అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో పసిపాపను ఎవరికైనా విక్రయించాలని అనుకున్నారు. ఈ విషయాన్ని మధ్యవర్తులకు తెలిపారు. దీంతో వారు ఖమ్మం జిల్లా కల్లూరికి చెందిన వ్యక్తికి పసిపాపను అమ్మేశారు. ఆ తర్వాత అంగన్ వాడీ కార్యకర్తల రిమ్స్ ఆస్పత్రిలో కనిపించలేదు. అయితే ఈ విషయం ఆస్పత్రి వైద్యులకు తెలియడంతో బాలల సంరక్షణ కమిటీకి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పసిపాప అచూకీ తెలుసుకుని కల్లూరు నుంచి క్షేమంగా ఒంగోలుకు తీసుకొచ్చారు. పసిపాప అలానా పాలనా చూస్తూ తమ సంరక్షణలో ఉంచారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తల్లి అంగన్ వాడీ కార్యకర్త ఆచూకీ కోసం ప్రయత్నం చేస్తున్నారు.