ఎమ్మెల్సీ జకియా ఖానంతో వైసీపీకి సంబంధం లేదు: ఎమ్మెల్సీ బొత్స

ఎమ్మెల్సీ జకియా ఖానం వైసీపీలో లేరని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తెలిపారు...

Update: 2024-10-20 11:58 GMT

దిశ, వెబ్ డెస్క్: తిరుమల శ్రీవారి దర్శనం టికెట్లు(Tirumala Srivari Darshan tickets) అమ్ముకున్నట్లు వైసీపీ ఎమ్మెల్సీ జకియా ఖానం(YCP MLC Zakia Khanam)పై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఎమ్మెల్సీ జకియా ఖానం తన సిఫార్సు లేఖతో 6 టికెట్లను ఇతరులను ఇప్పించారని, ఇందుకు రూ. 65 వేలు తీసుకున్నారని టీటీడీ అధికారులకు ఓ భక్తులు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారుల విచారణ చేపట్టారు. ఈ విచారణలో జకియా ఖానం టికెట్లు అమ్ముకున్నట్లు నిర్ధారణ అయింది. దీంతో ఆమెతో పాటు మరో ఇద్దరిపైనా కేసులు నమోదు చేశారు.

అయితే ఎమ్మెల్సీ జకియా ఖానం వైసీపీ(Ycp)లో లేరని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ(MLC Botsa Satyanarayana) తెలిపారు. వీఐపీ దర్శనం టికెట్లు అమ్ముకున్న జకియా ఖానంతో వైసీపీకి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయాన్ని అనవసరంగా వైసీపీకి అంటగట్టేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. కూటమి అధికారంలోకి రాగానే జకియా ఖానం టీడీపీ(Tdp)లోకి వెళ్లారని ఎమ్మెల్సీ బొత్స తెలిపారు. 


Similar News