Video Viral:ఆఫీస్‌లో ప్రభుత్వ ఉద్యోగి పబ్జీ గేమ్..షాక్ ఇచ్చిన ఎమ్మెల్యే?

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తూ ప‌బ్జి ఆడుతున్న ఓ ఉద్యోగి తీరుపై పోల‌వ‌రం ఎమ్మెల్యే చిర్రి బాల‌రాజు అసహనం వ్యక్తం చేశారు.

Update: 2024-07-30 13:00 GMT

దిశ,వెబ్‌డెస్క్:రాష్ట్రంలో వింత సంఘటన చోటుచేసుకుంది. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తూ ప‌బ్జి ఆడుతున్న ఓ ఉద్యోగి తీరుపై పోల‌వ‌రం ఎమ్మెల్యే చిర్రి బాల‌రాజు అసహనం వ్యక్తం చేశారు. అతనిపై చ‌ర్య‌లు తీసుకోవాల్సిందిగా ఉన్న‌తాధికారుల‌ను ఆదేశించారు. వివరాల్లోకి వెళితే.. ఏలూరు జిల్లా పోలవరం జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ప్రభుత్వ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేఆర్ పురం ఐటీడీఏ కార్యాలయానికి సామాన్యుడిలా మాస్క్ పెట్టుకుని వెళ్లారు. సాయి కుమార్ అనే ఉద్యోగి పనివేళలో తాపీగా పబ్జి గేమ్ ఆడుతుండడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అతడిని సస్పెండ్ చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ట్విట్టర్‌లో షేర్ చేయగా ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.

Tags:    

Similar News