Big Breaking: వైసీపీ పై ఎమ్మెల్యే పార్థసారధి ఆసక్తికర వ్యాఖ్యలు..

వైసీపీ లో చోటు చేసుకున్న మార్పులు చేర్పుల నేపథ్యంలో పెనమలూరు ఇంఛార్జ్‌గా మంత్రి జోగి రమేష్‌ని నియమించింది వైసీపీ.

Update: 2024-01-20 11:50 GMT

దిశ వెబ్ డెస్క్: వైసీపీ లో చోటు చేసుకున్న మార్పులు చేర్పుల నేపథ్యంలో పెనమలూరు ఇంఛార్జ్‌గా మంత్రి జోగి రమేష్‌ని నియమించింది వైసీపీ అధిష్టానం. ఈ నేపథ్యంలో పెనమలూరు సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తున్న తనను పక్కన పెట్టి మంత్రి జోగి రమేష్‌ కు వైసీపీ అధిష్టానం టికెట్ ఇవ్వడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన మాజీ మంత్రి, వైసీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే పార్థసారథి టీడీపీ గూటికి చేరారు. అతి త్వరలోనే సైకిల్‌ ఎక్కేందుకు సిద్దమవుతున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వస్తున్న వార్తలు వాస్తవమే అన్నట్లు ఎమ్మెల్యే పార్ధసారథి వైసీపీ ప్రభుత్వంపై విమర్శల జల్లు కురిపించారు.

వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పాలని నిర్ణయానికి వచ్చాక మొదటిసారిగా వైసీపీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రులని బూతులు తిట్టడానికి సమీక్షలు నిర్వహించే వైసీపీ.. రైతుల సమస్యలు పరిష్కారం కోసం కూడా సమీక్షలు నిర్వహిస్తే బావుంటుందని ఎమ్మెల్యే పార్ధసారథి పేర్కొన్నారు. అధికార ప్రభుత్వం అనాలోచిత చర్యల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్‌బీకే నుంచి మిల్లర్లకు తరలించిన ధాన్యాన్ని రోజుల తరబడి దిగుమతి చేసుకోక పోవడమే కాకుండా.. తేమ శాతం పేరు చెప్పి బస్తాపై 300 నుంచి 400 రూపాయలు తగ్గించి ఇస్తున్నారని మండిపడ్డారు. రైతులకు ధాన్యం డబ్బులు సకాలంలో చెల్లించడం లేదని.. తేమ శాతం పేరుతో రైతులను మోసం చేస్తున్నా అధికారులు, మంత్రులు స్పందించడం లేదని మండిపడ్డారు. ఇక్కడ ధాన్యాన్ని కడప, కర్నూలు, నెల్లూరు మిల్లులకు తరలించి ప్రభుత్వం స్థానిక మిల్లర్లకు అన్యాయం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.  

Read More..

Breaking: పార్థసారథికి టికెట్ ఫైనల్ అయినప్పుడు చూద్దాం..బోడేప్రసాద్‌ 

Tags:    

Similar News