నా గొంతు పెరిగేదే తప్ప.. తగ్గేది లేదు: మంత్రి కాకాణికి కోటంరెడ్డి కౌంటర్

ఏపీలో ఉమ్మడి నెల్లూరు జిల్లా రాజకీయాలు ఎన్నికలకు ముందే కాకరేపుతున్నాయి. అధికార వైసీపీపై సొంత పార్టీ ఎమ్మెల్యేలే తీవ్ర విమర్శులు చేస్తున్నారు.

Update: 2023-02-05 05:09 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో ఉమ్మడి నెల్లూరు జిల్లా రాజకీయాలు ఎన్నికలకు ముందే కాకరేపుతున్నాయి. అధికార వైసీపీపై సొంత పార్టీ ఎమ్మెల్యేలే తీవ్ర విమర్శులు చేస్తున్నారు. ఎమ్మెల్యేలు కోటం రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. త్వరలోనే వీరు పార్టీ మారుతారని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇందులో ముఖ్యంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి వైసీపీపై సంచలన ఆరోపణలు చేస్తున్నారు. జగన్ సర్కార్ ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాపింగ్ చేస్తోందని కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో కోటంరెడ్డికి, వైసీపీ నేతలకు మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.

ఇదిలా ఉండగానే ప్రభుత్వం ఎమ్మెల్యే కోటంరెడ్డి భద్రతను తగ్గించింది. ఇప్పటి వరకు 2 ప్లస్ 2గా ఉన్న సెక్యూరిటీని 1 ప్లస్ 1కి తగ్గించింది. భద్రత కుదింపుపై తాజాగా ఎమ్మె్ల్యే కోటంరెడ్డి స్పందించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నాకు గన్ మెన్లను తగ్గించిన సర్కార్‌కు నేనే రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నానన్నారు. మీరు ఇద్దరు గన్ మెన్లను తొలగించారని.. కానీ మిగిలిన ఇద్దరు గన్ మెన్లు కూడా నొకొద్దని ఆయన అన్నారు. కోటంరెడ్డి పెద్ద గొంతుతో మాట్లాడితే భయపడుతామ అన్నా మంత్రి కాకాణి వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. నా గొంతు పెరిగేదే తప్ప.. తగ్గేదిలేదని కోటంరెడ్డి తేల్చి చెప్పారు. గన్ మెన్లను తొలగించినంతా మాత్రాన తాను భయపడనని చెప్పారు.

READ MORE

బ్రేకింగ్: ఎమ్మెల్యే కోటంరెడ్డికి షాక్.. సెక్యూరిటీ తగ్గిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం 

Tags:    

Similar News