గుడివాడ ఇంచార్జి మార్పు.. స్పందించిన కొడాలి నాని

గుడివాడ ఇంచార్జి మార్పుపై జరుగుతున్న ప్రచారంపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు....

Update: 2024-02-19 14:30 GMT

దిశ, వెబ్ డెస్క్: గుడివాడ వైసీపీలో అసమ్మతి సెగ రేగిన విషయం తెలిసిందే. గుడివాడ వైసీపీ అభ్యర్థిగా మండలి హనుమంతరావును నియమించబోతున్నట్లు ఫ్లెక్సీలు వెలిశాయి. దీంతో కొడాలి నానికి ఈసారి సీటు ఇవ్వడంలేదనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కొడాలి నాని స్పందించారు. ఇప్పటి వరకూ సీఎం జగన్ ఏడు విడతల్లో వైసీపీ ఇంచార్జులను ప్రకటించారని గుర్తు చేశారు. కొన్ని నియోజకవర్గాల్లో మార్పులు, చేర్పులు జరుగుతున్నాయని తెలిపారు. వైసీపీలో సీట్ల మార్పుపై సీఎం జగన్ దే నిర్ణయమని చెప్పారు. తనను ఓడించాలంటే చంద్రబాబు తీసుకొచ్చి గుడివాడలో పోటీ చేయించాలని సవాల్ విసిరారు. గుడివాడలో తాను పోటీ చేయాలో లేదో సీఎం జగన్ నిర్ణయిస్తారని వ్యాఖ్యానించారు. కొంతమంది పకోడి గాళ్లు గుడివాడలో పోటీ చేస్తున్నారని తాను కూడా ఫ్లెక్సీ పెడతానని, అది నిజమవుతుందా అని ప్రశ్నించారు. గన్నవరంలో వంశీని, గుడివాడలో తనను మారుస్తారని సీఎం జగన్ చెప్పారా అని నిలదీశారు. డబ్బులకు సీట్లు అమ్ముకోవడం వైసీపీలో ఉండదని నాని పేర్కొన్నారు. చంద్రబాబుకు దమ్ముంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సీట్లు ఇవ్వాలని సవాల్ చేశారు. సీట్లు మారుస్తాడా లేదా నేది సీఎం జగన్‌కు సంబంధించిన విషయమని.. టీడీపీ వాళ్లకెందుకని కొడాలి నాని మండిపడ్డారు. 

Tags:    

Similar News