నంద్యాలలో దారుణం.. . టీడీపీ నేతలకు ఎమ్మెల్యే కాటసాని స్ట్రాంగ్ వార్నింగ్

వైసీపీ నేత సుబ్బరాయుడు దారుణ హత్యపై ఎమ్మెల్యే కాటసాని సంచలన ఆరోపణలు చేశారు..

Update: 2024-08-04 12:49 GMT

దిశ, వెబ్ డెస్క్: నంద్యాల జిల్లా సీతారామపురంలో వైసీపీ నేత సుబ్బరాయుడు దారుణ హత్యకు గురయిన విషయం తెలిసిందే. సుబ్బరాయుడు మృతదేహానికి ఎమ్మెల్యేలు విరూపాక్షి, కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్, మాజీ ఎమ్మెల్యే శిక్రపాణి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ సంచలన ఆరోపణలు చేశారు. రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తి అని కూడా చూడకుండా టీడీపీ నాయకులే హత్య చేశారని ఆరోపించారు. పోలీసుల సమక్షంలోనే సుబ్బారాయుడి హత్య జరిగిందన్నారు. టీడీపీ నేతలు హత్యారాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ నాయకులు ఇకనైనా మానుకోవాలని, లేనిపక్షంలో తీవ్ర పరిణామాలుంటాయని కాటసాని రాంభూపాల్ రెడ్డి హెచ్చరించారు. 

Tags:    

Similar News