అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే కరణం
అభివృద్ధి పనులలో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని, అలసత్వం వహిస్తే ఊరుకునేది లేదని చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణ మూర్తి అధికారులను హెచ్చరించారు.
దిశ, చీరాల : అభివృద్ధి పనులలో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని, అలసత్వం వహిస్తే ఊరుకునేది లేదని చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణ మూర్తి అధికారులను హెచ్చరించారు. చీరాల నియోజకవర్గంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను మంగళవారం ఎమ్మెల్యేబలరామకృష్ణ మూర్తి విస్తృతంగా పర్యటించారు. ఎమ్మెల్యే పర్యటనలో భాగంగా రోశయ్య కాలనీ, సంపత్ నగర్ మూడు రోడ్ల సెంటర్, రామకృ ష్ణాపురంలో సిమెంట్ రోడ్లు, డ్రైనేజీ అభివృద్ధి పనులను, అక్కాయి పాలెం పంచాయతీ పరిధిలో, లక్ష్మీపురంలో స్మశాన వాటిక ప్రహరీ గోడ, స్వామి వివేకా నంద కాలనీలో, మంచి నీటి పైపులైన్ల అభివృద్ధి పనులను పరిశీలించారు.
నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ, త్వరిత గతిన పనులను పూర్తి చేయాలని, అధికారులకు, సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఎమ్మెల్యే బలరామ్ వెంట చీరాల, వేటపాలెం మండలం ఎంపీడీఓ లు నేతాజీ, శర్మ, ఆర్.డబ్ల్యూ. ఎస్.డి.ఇ , చుండూరు వాసు, లేళ్ల శ్రీధర్, జంగిలి రామారావు, మంతు, అందే కృష్ణ, కర్ణ లక్ష్మణరావు, కర్ణ కృష్ణ మోహన్, కట్టా దాసు, సెక్రెటరీలు శ్రీనివాసులు,శివ లీల,తదితర అధికారులు పాల్గొన్నారు.