AP:వరద బాధితులకు ఎమ్మెల్యే భాష్యం భరోసా

నియోజకవర్గ నాయకులు, అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి ప్రజల అవసరం మేరకు సహాయ సహకారాలు అందిస్తామన్నారు.

Update: 2024-08-31 12:29 GMT

దిశ,పెదకూరపాడు: నియోజకవర్గ నాయకులు, అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి ప్రజల అవసరం మేరకు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. రెవిన్యూ , విద్యుత్, గ్రామీణ నీటి సరఫరా, మున్సిపల్, రహదారులు భవనాలు తదితర శాఖల అధికారులకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజల విజ్ఞప్తి మేరకు తక్షణం స్పందించి, సహాయక చర్యలు చేపట్టాలని, ముంపు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి తగిన సహాయక చర్యలు చేపట్టాలని టీడీపీ శ్రేణులకు, అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ముంపు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసి పునరావాస కేంద్రాలకు తరలించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని, చెరువులు, వాగులు ప్రవహించే ప్రాంతాల్లో ప్రజలు ప్రయాణించ వద్దని, భారీ వర్షాలతో నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి సమస్యలు తలెత్తినా తమను సంప్రదిస్తే అవసరమైన సహాయాన్ని అందించేలా నిబద్ధతతో పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.


Similar News