దిశ, ఏపీ బ్యూరో: వైసీపీ ప్రభుత్వంపై ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మంగళవారం విజయవాడలో మాట్లాడిన ఆయన, ఇచ్చిన హామీలు నెరవేర్చమంటే ఆర్థిక పరిస్థితులు బాగోలేవంటారా అని ధ్వజమెత్తారు. పనికిరాని సలహాదారులకు రూ. కోట్లు ఇస్తున్నారు కానీ, ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఉన్న ఉద్యోగుల డిమాండ్లు పరిష్కరించరా అని ప్రశ్నించారు. ఉద్యోగులంటే జగన్‌రెడ్డకి, వైసీపీ ఎంపీలకు ఎందుకంత చులకనభావమని నిలదీశారు. కరోనా వంటి విపత్కర సమయంలో సలహాదారులు ఇళ్లల్లో కూర్చుంటే, ఉద్యోగులు ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తించారని గుర్తు చేశారు. ఇప్పటికైనా వైసీపీ ప్రభుత్వం ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని ఎమ్మెల్యే అనగాని అన్నారు.