AP:‘రాష్ట్రపతి పాలన తీసుకొచ్చే కుట్ర జరుగుతోంది’..మంత్రి సంచలన వ్యాఖ్యలు

ఇటీవల ఏపీలో కురిసిన భారీ వర్షాలు(Heavy Rains), వరద(Floods)ల సమయంలో విజయవాడ ప్రకాశం బ్యారేజీ గేట్లను బోట్లు ఢీకొట్టిన విషయం తెలిసిందే.

Update: 2024-09-11 09:06 GMT

దిశ,వెబ్‌డెస్క్:ఇటీవల ఏపీలో కురిసిన భారీ వర్షాలు(Heavy Rains), వరద(Floods)ల సమయంలో విజయవాడ ప్రకాశం బ్యారేజీ గేట్లను బోట్లు ఢీకొట్టిన విషయం తెలిసిందే. ఈ విషయంలో వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో ప్రకాశం బ్యారేజీ కౌంటర్ వెయిట్లను ఢీకొట్టిన బోట్లు వైసీపీ నేతలకు చెందినవేనని మంత్రి మండిపల్లి రాం ప్రసాద్ రెడ్డి వ్యాఖ్యానించారు. మంగళగిరిలోని టీడీపీ(TDP) కేంద్ర కార్యాలయంలో ఆయన నేడు(బుధవారం)మీడియా సమావేశంలో పాల్గొన్నారు.

ఈ నేపథ్యంలో మంత్రి రాం ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ..విపత్తు(Disaster) సమయంలో అందరూ సహాయం చేస్తుంటే వైసీపీ(YCP) మాత్రం రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. బ్యారేజీని కూల్చివేసి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన తీసుకురావాలనే కుట్రతోనే బోట్లను ఢీకొట్టేలా చేశారన్నారు. ప్రజాప్రతినిధిగా జగన్ వ్యవహరించట్లేదని దుయ్యబట్టారు. ప్రజలు కష్టాల్లో ఉంటే జగన్‌కు రాజకీయాలు కావాల్సి వచ్చిందా స్వాతంత్య్ర సమరయోధుడు జైల్లో ఉన్నట్లు నందిగం సురేష్‌ను పరామర్శించారని ఎద్దేవా చేశారు. మాజీ ఎంపీ కోసం జైలుకు వెళ్లి పరామర్శించిన జగన్ వరదలతో కష్టాలు అనుభవిస్తున్న ప్రజల బాధలు పట్టావా? అని మంత్రి రాం ప్రసాద్ రెడ్డి ఫైరయ్యారు.


Similar News