Nara Lokesh:రేపటి నుంచే పదో తరగతి పరీక్షలు.. విద్యార్థులకు మంత్రి కీలక సూచనలు

రాష్ట్రవ్యాప్తంగా రేపటి(సోమవారం) నుంచి పదో తరగతి పరీక్షలు(10th Class Exams)జరగనున్నాయి.

Update: 2025-03-16 09:14 GMT

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రవ్యాప్తంగా రేపటి(సోమవారం) నుంచి పదో తరగతి పరీక్షలు(10th Class Exams)జరగనున్నాయి. మార్చి 17న ప్రారంభమై ఏప్రిల్‌ 1 వరకు ఈ పరీక్షలు కొనసాగుతాయి. ఈ పరీక్షలు ఉదయం 9:30 నుంచి మ.12:45 వరకు నిర్వహించనున్నారు. ఈ పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 6,49,275 మంది విద్యార్థులు(Students) సిద్ధంగా ఉన్నారు. పదో తరగతి పరీక్షల దృష్ట్యా విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఎండల తీవ్రత పెరిగిపోవడంతో.. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేశారు.

ఈ క్రమంలో తాజాగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి(Education Minister) నారా లోకేష్(Nara Lokesh) పదో తరగతి పరీక్షలు రాయబోతున్న విద్యార్థులకు కీలక సూచనలు చేశారు. ఈ నేపథ్యంలో పరీక్షలు రాయనున్న విద్యార్థులకు మంత్రి నారా లోకేష్ ఆల్ ది బెస్ట్ చెప్పారు. ‘‘విద్యార్థులందరికీ శుభాకాంక్షలు. అందరూ చక్కగా పరీక్షలు రాయాలని, మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను. సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోండి. టెన్షన్, ఆందోళన పడొద్దు. ఎటువంటి ఒత్తిడి(Stress)కి గురి కావద్దు. హాల్‌టికెట్(Hall Ticket) తప్పనిసరిగా తీసుకెళ్లండి. ఇన్నాళ్లు మీరు చదివిన కష్టం ఫలితాల రూపంలో వచ్చే సమయం ఇది. ప్రశాంతంగా ఉండండి. సకాలంలో పరీక్ష పూర్తి చేయండి. విజయీభవ’’ అని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.

READ MORE ...

AP:పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు కీలక ప్రకటన



Tags:    

Similar News