ఉత్తరాంధ్రను అవమానించిన మంత్రి పెద్దిరెడ్డిని బర్తరఫ్ చేయాలి: కిమిడి కళా వెంకట్రావు

టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ శ్రీకాకుళం నుండి కుప్పంకు టీడీపీ కార్యకర్తలు చేపట్టిన సైకిల్ యాత్రపై వైసీపీ సైకోల ప్రవర్తన కలచివేసింది అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కిమిడి కళా వెంకట్రావు అన్నారు.

Update: 2023-10-22 09:29 GMT

దిశ , డైనమిక్ బ్యూరో : టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ శ్రీకాకుళం నుండి కుప్పంకు టీడీపీ కార్యకర్తలు చేపట్టిన సైకిల్ యాత్రపై వైసీపీ సైకోల ప్రవర్తన కలచివేసింది అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కిమిడి కళా వెంకట్రావు ఆరోపించారు. ఉత్తరాంధ్రను అవమానించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని బర్తరఫ్ చేయాలి అని డిమాండ్ చేశారు. ప్రజలు స్వేచ్ఛగా జీవించే హక్కును కాలరాస్తున్నారు అని మండిపడ్డారు. చొక్కాలిప్పించి ఒంటిపై నిల్చోబెట్టడానికి మనసెలా ఒప్పింది అని ధ్వజమెత్తారు. ఇది మీ రాచరికమా లేక పెత్తందారీ పోకడలా పెద్దిరెడ్డి? ఘటన జరిగి రెండు రోజులైనా సీఎం స్పందించకపోవడం సైకో మనస్తత్వానికి నిరద్శనం అని విరుచుకుపడ్డారు. పుంగనూరులో అడుగుపెట్టి మళ్లీ వెళ్తారా అని హెచ్చరిస్తారా...పుంగనూరు ఏమైనా పాకిస్తానా.? దేశ సరిహద్దుల్లోనూ లేని ఆంక్షలు పుంగనూరులో ఉన్నాయి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పుంగనూరులోనే ఇటువంటి చర్యలకు పాల్పడితే..ఇక విశాఖకు సీఎం వస్తే అక్కడి ప్రాంత వాసులకు స్వేచ్ఛ ఉండనిస్తారా.? ఉత్తరాంధ్ర సంపద, భూములపైనే వైసీపీ కన్న తప్ప..ఈ ప్రాంత ప్రజలపై ఏమాత్రం గౌరవం లేదు అని నిప్పులు చెరిగారు. ఘటనపై కనీసం శ్రీకాకుళం జిల్లాకు చెందిన మంత్రులు కూడా స్పందించకపోవడం చూస్తే వారి బానిసత్వం ఏ స్థాయిలో ఉందో అద్దం పడుతోంది అని అన్నారు. వైసీపీలోని సీఎం సామాజిక వర్గానికి గులాంగిరి చేయడం మానుకోవాలి. ఉత్తరాంధ్ర ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన వైసీపీకి ఉనికి లేకుండా చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పరిస్థితులపై మానవ హక్కుల కమిషన్ కూడా స్పందించాలి అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కిమిడి కళా వెంకట్రావు కోరారు.

Tags:    

Similar News