Polavaram:‘ఇది ప్రకృతి తప్పిదం కాదు’..డయాఫ్రమ్ వాల్‌పై మంత్రి నిమ్మల సెన్సేషనల్ కామెంట్స్!
ఏపీలో ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే కూటమి భారీ మెజారిటీ సాధించి నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
దిశ,వెబ్‌డెస్క్:ఏపీలో ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే కూటమి భారీ మెజారిటీ సాధించి నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు రాష్ట్రాభివృద్ధి పై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు, జలవనరుల శాఖ మంత్రులు నిపుణులతో భేటీ అవుతున్నారు. వివరాల్లోకి వెళితే..ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పోలవరం ప్రాజెక్టు డయాఫ్రమ్ వాల్‌పై నిపుణుల కమిటీ రిపోర్ట్ రాకముందే రాష్ట్ర ప్రభుత్వం పై వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని ఫైర్ అయ్యారు.
2020 ఆగస్ట్‌లో వచ్చిన వరదలకు పోలవరం డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నదని నీతి ఆయోగ్ రిపోర్ట్ ఇచ్చిందని తెలిపారు. ఇది ప్రకృతి తప్పిదం కాదు.. ప్రభుత్వ తప్పిదమని ఐఐటీ హైదరాబాద్ నిపుణులు రిపోర్ట్ ఇచ్చింది అని అన్నారు. ఇది నిజమో, కాదో జగన్, వైసీపీ నాయకులు సమాధానం చెప్పాలని మంత్రి నిమ్మల డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం రీయంబర్స్ చేసిన 4 వేల కోట్ల రూపాయల నిధులు గత వైసీపీ ప్రభుత్వం దారి మళ్లించిందిని మంత్రి నిమ్మల ఆరోపించారు. రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టు నిధులను సైతం మళ్లించి రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిన వైసీపీ నాయకులకు పోలవరం ప్రాజెక్టుపై మాట్లాడే హక్కు లేదని విమర్శలు గుప్పించారు.