Minister Nimmala:‘జగన్ పాల‌న ఆ ప్రాజెక్టుకు శాపంగా మారింది’.. మంత్రి నిమ్మ‌ల‌ సంచలన వ్యాఖ్యలు

ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వంతోనే(AP Government) రాష్ట్రాభివృద్ధి(State Development) సాధ్యం అవుతుందని జలవనరుల శాఖ మంత్రి(Minister of Water Resources) నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.

Update: 2024-10-29 09:26 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వంతోనే(AP Government) రాష్ట్రాభివృద్ధి(State Development) సాధ్యం అవుతుందని జలవనరుల శాఖ మంత్రి(Minister of Water Resources) నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఈ క్రమంలో గత వైసీపీ(YCP) ప్రభుత్వం పై మంత్రి నిమ్మల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో మంత్రి నిమ్మల నేడు ప్రకాశం జిల్లా(Prakasam District)లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించారు. గత ప్రభుత్వ హయాంలో వెలిగొండ ప్రాజెక్టు(Veligonda project) విష‌య‌మై వైఎస్ జగన్ పై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. జ‌గ‌న్ పాల‌న వెలిగొండ ప్రాజెక్టుకు శాపంగా మారిందని దుయ్య‌బ‌ట్టారు. ఎన్నిక‌ల ముందు హ‌డావిడిగా ప్రాజెక్టును జాతికి అంకితం చేశార‌ని ఫైరయ్యారు.

 

గత ప్రభుత్వం ప‌నులు అప్ప‌గించి.. అవి పూర్తికాకుండానే నిధులు క‌ట్ట‌బెట్టార‌ని మంత్రి నిమ్మల(Nimmala Ramanaidu) ఆరోపించారు. 10 క్యూసెక్కులు కూడా లేకుండానే ప్రాజెక్టు ప్రారంభోత్స‌వం అంటూ ఊద‌ర‌గొట్టార‌ని విమర్శించారు. గత ప్రభుత్వం ఒక్క గ్రామానికి కూడా పున‌రా‌వాస కాల‌నీలు నిర్మించిన పాపాన పోలేద‌ని ఆగ్ర‌హం వ్యక్తం చేశారు. గ‌త టీడీపీ(TDP) పాల‌న‌లో ప్రాజెక్టుకు రూ. 1,373 కోట్లు కేటాయించి, రూ.1,319 కోట్లు ఖ‌ర్చు చేశామ‌ని మంత్రి నిమ్మ‌ల గుర్తు చేశారు. ఏ ప్రాజెక్టుకు వెళ్లినా జ‌గ‌న్ విధ్వంస‌మే క‌నిపిస్తుంద‌ని ఆయన ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

Tags:    

Similar News